గత అడ్డంకుల్ని అధిగమిస్తుంది.. యూకే - ఇండియా కొత్త మైగ్రేషన్ ఒప్పందంపై ప్రీతి పటేల్ వ్యాఖ్యలు

భారత్- యూకేల మధ్య మైగ్రేషన్ అండ్ మొబిలిటీ పార్టనర్‌షిప్ (ఎంఎంపీ) పేరిట ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే.దీనిపై భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్, బ్రిటన్ హోం శాఖ కార్యదర్శి ప్రీతి పటేల్‌లు సంతకం చేశారు.

 India-uk Migration Pact Overcomes Past Barriers: Uk's Home Secretary Priti Patel-TeluguStop.com

దీనిపై ప్రీతి పటేల్ మాట్లాడుతూ.ఈ కొత్త ఒప్పందం.

గతంలో ఇమ్మిగ్రేషన్‌ విధానంలో వున్న అడ్డంకుల్ని అధిగమిస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు.దీని వల్ల ఏడాదికి 3 వేల మంది విద్యార్ధులు, నిపుణులు ఏ దేశంలోనైనా కొత్తగా పని అనుభవాన్ని పొందవచ్చని ప్రీతి పటేల్ తెలిపారు.ఈ కొత్త ఒప్పందం కొద్దినెలల్లో అమల్లోకి రానుంది.18-30 ఏళ్ల లోపు యువత ఇరు దేశాల్లో 24 నెలల పాటు బస కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ప్రీతి పటేల్ తెలిపారు.ఈ పథకం రెండు దేశాలకు అదనపు ప్రయోజనాన్ని అందిస్తుందని ఆమె ఆకాంక్షించారు.అంతేకాకుండా యూకే- ఇంగ్లాండ్‌ల మధ్య వున్న సంబంధాన్ని మరింత దృఢంగా మారుస్తుందని ప్రీతి పటేల్ చెప్పారు.

కొత్త ఒప్పందం ప్రకారం.2022 ఏప్రిల్ నాటికి కొత్త వ్యవస్థలను తీసుకురావడానికి ఇరు పక్షాలు అంగీకరించాయి.లండన్‌లోని భారత హైకమీషన్, న్యూఢిల్లీలోని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇప్పటికే పనులు ప్రారంభించాయి.దీనిని కార్యరూపంలోకి తీసుకొచ్చేందుకు తాము ఎంతో వేగంతో పనిచేశామని, త్వరలో టైమ్ టేబుల్‌ని ప్రకటిస్తామని ప్రీతి పటేల్ వెల్లడించారు.

కొత్త యూత్ మొబిలిటీ విధానం బ్రిటన్ పోస్ట్ బ్రెగ్జిట్ పాయింట్ల ఆధారిత ఇమ్మిగ్రేషన్ వ్యవస్థ కింద పనిచేస్తుంది.యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ తప్పుకున్న తర్వాత ఈ ఏడాది నుంచి కొత్త ఇమ్మిగ్రేషన్ విధానాలు అమల్లోకి రావడంతో భారతీయులకు భారీ ప్రయోజనం చేకూరుతోందని ప్రీతి పటేల్ చెప్పారు.

Telugu Amit Shah, Britain Brexit, India, Narendra Modi, Delhi, Preeti Patel, Uk

పాయింట్ల ఆధారిత వ్యవస్థ ఉద్దేశ్యం గతంలో భారత్‌కు ప్రతికూలంగా వున్న అంశాలను తొలగించడమేనని ఆమె పేర్కొన్నారు.తాను హోంశాఖ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇరు దేశాల్లోని యువ నిపుణుల ప్రయోజనాల కోసం కొత్త విధానాన్ని రూపకల్పన చేసినట్లు ప్రీతి పటేల్ వెల్లడించారు.కొత్త మొబిలిటీ ఎజెండాను ప్రోత్సహించిన ఘనత భారత ప్రధాని నరేంద్రమోడీ, యూకే పీఎం బోరిస్ జాన్సన్, భారత హోంశాఖ మంత్రి అమిత్‌షాలదేనని ఆమె ప్రశంసించారు.ఇరు దేశాలకు సంబంధించినంత వరకు ఈ ఒప్పందం ఒక మైలురాయిగా నిలిచిపోతుందని ప్రీతి పటేల్ అభివర్ణించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube