31 ఏళ్ల క్రితం మన దేశంలోనూ శ్రీలంక తరహా పరిస్థితులు!

అది 1991వ సంవత్సరం.జూన్ నెల.

భారత ప్రభుత్వం ముందు ఆర్థిక సంక్షోభం తలెత్తింది.

విదేశీ మారకద్రవ్య నిల్వలు దాదాపు ఖాళీ అయ్యాయి.

బిలియన్ డాలర్లు మాత్రమే మిగిలాయి.దీని కారణంగా దేశం 20 రోజులకు సరిపడా చమురు, ఆహార పదార్థాలను మాత్రమే ఆర్డర్ చేయగలిగే పరిస్థితి ఏర్పడింది.

భారీ విదేశీ రుణం మెడకు చుట్టుకుంది.ప్రస్తుతం శ్రీలంకలో ఉన్న పరిస్థితులకు నాటి మర దేశ పరిస్థితులు దగ్గరగా ఉన్నాయి.

Advertisement

అయితే ఆ పరిస్థితుల నుంచి మన దేశం త్వరగానే కోలుకుంది.అప్పట్లో దేశంలో చంద్రశేఖర్‌ ప్రభుత్వం ఉండేది.

నవంబరు 1990 నుంచి జూన్ 1991 వరకు ఏడు నెలల పాటు ఆయన దేశ ప్రధానిగా ఉన్నారు.దీని తర్వాత ఏర్పాటైన పివి నరసింహారావు ప్రభుత్వం దేశ ఆర్థిక పరిస్థితులను సమూలంగా మార్చివేసింది.

అయితే 90వ దశకం చివరిలో మనదేశం నూతన ఆర్థిక విధానాలను రూపొందించింది.దీంతో మన విదేశీ మారక నిల్వలు మళ్లీ వేగంగా పెరగడం ప్రారంభించాయి.

కాలం గడిచి ఇప్పుడు మనం ఆర్థిక పరిపుష్టి విషయంలో ప్రపంచంలోనే గుర్తించదగిన స్థానంలో ఉన్నాం.మన దేశంలో సంక్షోభం నెలకొన్నప్పుడు ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద రుణగ్రహీత దేశంగా మారింది.

రాజమౌళి వల్లే టాలీవుడ్ హీరోలకు ఈ స్థాయిలో గుర్తింపు.. నమ్మకపోయినా నిజమిదేనా?
బర్త్ డే క్వీన్ నవీన రెడ్డి : మంచి పాత్రలు చేస్తూ ఇండస్ట్రీ లో స్టార్ ఇమేజ్ దక్కించుకున్న నటి...

అప్పుడు భారతదేశ విదేశీ అప్పు 72 బిలియన్ డాలర్లకు చేరుకుంది.బ్రెజిల్, మెక్సికోల తర్వాత మనదేశం ప్రపంచంలో మూడవ అతిపెద్ద రుణగ్రస్తుల దేశంగా మారిపోయింది.

Advertisement

ప్రభుత్వంపైనా, ఆర్థిక వ్యవస్థపైనా ప్రజలకు నమ్మకం సన్నగిల్లడం ప్రారంభమైంది.

ఎప్పుడైతే ద్రవ్యోల్బణం దారుణంగా పడిపోవడం ప్రారంభించిందో, అప్పుడు రెవెన్యూ లోటు పెరిగింది.కరెంటు ఖాతా లోటు రెండంకెల్లో ఉంది.అయితే ఆ సమయంలో దీనికి కారణం అంతర్జాతీయ సమస్యలు.

గల్ఫ్ యుద్ధం 1990లో ప్రారంభమైంది.దీని ప్రభావం భారత్‌పై కూడా పడింది.ప్రపంచ వ్యాప్తంగా చమురు ధరలు విపరీతంగా పెరిగాయి.1990-91లో ఈ యుద్ధం కారణంగా కారణంగా భారతదేశానికి రావాల్సిన $2 బిలియన్ల పెట్రోలియం దిగుమతి బిల్లు రెట్టింపు కంటే అత్యధికంగా పెరిగి అది $5.7 బిలియన్లకు చేరుకుంది.

తాజా వార్తలు