2023 లో హాకీ ప్రపంచ కప్ కి ఆతిథ్యం ఇవ్వనున్న ఇండియా

భారత జాతీయ క్రీడా ఏదంటే ఎవరైనా వెంటనే హాకీ అని చెప్పేస్తారు.హాకీలో ఒకప్పుడు తిరుగులేని రారాజుగా వెలిగిన ఇండియా తరువాత అధమస్తానానికి పడిపోయింది.

 India Tohost Mens Hockey World Cup In 2023-TeluguStop.com

ఒకానొక దశలో కనీసం ప్రపంచ కప్ లో పాల్గొనడానికి కూడా అవకాశం లేనంతగా దిగజారిపోయింది.మరల ఇప్పుడిప్పుడే హాకీ ఇండియా పుంజుకుంటుంది.

అయిన కూడా ఒకప్పటి స్థాయిలో హాకీ ఇండియా టీం లేదనే చెప్పాలి.ఇండియాలో క్రికెట్ కి ఉన్నంత ప్రాముఖ్యత హాకీకి లేకపోవడం కూడా ఆ ఆట స్థాయి పడిపోయింది అని చెప్పాలి.

ఇదిలా ఉంటే మరల చాలా ఏళ్ల తర్వాత 2023లో జరగనున్న పురుషుల ప్రపంచకప్‌కు ఇండియా ఆతిథ్యమివ్వనున్నది.హాకీ ఇండియా, ఒడిషా గవర్నమెంట్ స్పోర్ట్స్ డిపార్ట్‌మెంట్ సంయుక్తంగా హాకీ ప్రపంచకప్-23ను నిర్వహించనున్నట్లు ఒడిషా ప్రభుత్వం ప్రకటించింది.

భువనేశ్వర్, రౌర్కేలాలోని మైదానాల్లో ఈ మ్యాచ్‌లు జరుగనున్నట్లు హాకీ ఇండియా, ఒడిషా స్పోర్ట్స్ డిపార్టుమెంట్‌లు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి.మరి ఈ హాకీ ప్రపంచ కప్ లో అయిన ఇండియా మెరుస్తుందో లేదో చూడాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube