బీజేపి భయపెడుతున్న “ఇండియాటుడే సర్వే”   INDIA TODAY Shocking Survey..on NDA     2018-01-27   01:01:34  IST  Bhanu C

బీజేపి సత్తా మళ్లీ మరోసారి దేశం అంతటా చాటి చెప్పనుంది..వచ్చే ఎన్నికల్లో భారీ మెజారిటీలు ఖాయం..కేంద్రంలో మళ్లీ చక్రం తిప్పుంది అంటూ కొన్ని రోజుల క్రితం వచ్చిన రిపబ్లిక్ సర్వే సంచలన సృష్టించింది..అయితే ఆ సర్వే తాలూకు బలుపుని రాష్ట్రాలలో ఉన్న అన్ని బీజేపి నాయకులు జబ్బలు చరుచుకుని మరీ ప్రత్యర్ధి పార్టీలపై విరుచుకు పడ్డారు..నోటికి వచ్చిన మాటలు మాట్లాడుతూ కాలర్లు ఎగరేశారు..అంతెందుకు దక్షిణాదిలో బలంగా లేని బీజేపి పొత్తు ఉంటే తప్ప గెలవలేని పరిస్థితిలో ఉన్న బీజేపి సైతం మిత్ర్ర పక్ష పార్టీలపై విరుచుకుపడ్డాయి…అప్పటి వరకూ ఉన్న స్నేహ భందాన్ని మరిచి మరీ రంకెలు వేశాయి..ముఖ్య్మగా ఏపీలో అయితే ఆ బలుపు బాగా కనపడింది..

అయితే ఇప్పుడు బీజేపి వేస్తున్న రంకేలకి ఇండియాటుడే ముక్కకు తాడు వేసింది..ఇక ఎగిరింది చాలు ఒక్క నిమిషం ఆగు అంటూ తన సర్వే రిపోర్టు తీసి చేతిలో పెట్టింది..దాంతో ఖంగుతిన్న బీజేపి కొంచం వెనక్కి తగ్గిందనే చెప్పాలి..రిపబ్లిక్ సర్వే కంటే పూర్తి భిన్నంగా ఇండియా టుడే సర్వే ఉంది ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తప్పకుండ బీజేపి కి ఘోరమైన పరాజయం తప్పదని తేలిచి చెప్పింది..”ఇండియా టుడే” “ఆజ్ తక్” చానెళ్ళు ఉన్న ప్రముఖ మీడియా సంస్థ అయిన ఇండియాటుడే దేశవ్యాప్తం గా సర్వే చేపట్టింది..

ఈ సర్వే ప్రతీ ఏడాది “మూడ్ ఆఫ్ తె నేషన్ “ సర్వేను ప్రకటిస్తుంది అయితే ఇప్పుడు తాజాగా చేసిన సర్వేలో ఎన్డీయే కూటమికి సుమారు 258 సీట్లు వస్తాయని చెప్పింది..అయితే అధికారం రావాలంటే మాత్రం మరో 15 సీట్లు అవసరమని చెప్పింది అయితే బీజేపి పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో అనే విషయాలని వెల్లడించింది ఇండియా టుడే..బీజేపి నేతృత్వంలో ఉండే కూటమి కూడా గెలుపు పొందాలంటే మాత్రం ఎంతో కష్టమని తేల్చి చెప్పింది.. ఎంతో కష్టపడాలని తెలిపింది…అయితే యూపీఏ కి 202 సీట్లు వస్తాయని పేర్కొంది…అయితే ఇతరులతో వచ్చే సీట్లు ఆధారంగానే ఎన్డీయే కి లాభం చేకూరుతుందని రెండు కూటములు సాయం లేకుండా ప్రభుత్వం ఏర్ప్తాటు చేయడం అసంభవమని తెలిపింది. దాంతో మిత్ర పక్షాలుని ఇప్పుడు బీజేపి ప్రసన్నం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది బీజేపీకి..మరి రానున్న రోజులు ఇలానే ఉంటాయ లేక మరింతగా బీజేపి కి నష్టం చేకూరుతుందా అనేది ఎన్నికల ముందు గానీ తెలియదు అంటున్నారు విశ్లేషకులు.