ఎన్‌జీవోలకు విదేశీ నిధులు.. నిబంధనలు మరింత కఠినతరం

విదేశాల నుంచి ఎన్‌జీవోలు అందుకుంటున్న నిధులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిబంధనలను మరింత కఠినతరం చేసింది.దీనిలో భాగంగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ బ్యాంకులకు కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.

 India Tightens Oversight On Funds Received By Ngos, Delhi, Ngo, Sbi Bank,  Khali-TeluguStop.com

దీని ప్రకారం ఎన్జీవోలు ఏ విదేశీ సంస్థల నుంచి ఆర్ధిక సాయం పొందినా.ఆ సంస్థ మూలాలు భారత్‌లో ఉన్నప్పటికీ దానిని ‘‘ విదేశీ సాయం’’ కిందే పరిగణించాలని హోంశాఖ తెలిపింది.

ప్రస్తుత నిబంధనల ప్రకారం ఎఫ్‌సీఆర్ఏ కింద రిజిస్ట్రేషన్ చేయబడిన ఏదైనా ఎన్జీవో, అసోసియేషన్, వ్యక్తి, విదేశీ సహకారాన్ని స్వీకరించడం లేదా ఉపయోగించం లాంటి చర్యలకు చేపడితే అన్ని బ్యాంకులు 48 గంటల్లోపు కేంద్ర ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాలి.

గతేడాది సెప్టెంబర్‌లో విదేశీ సహకారం (నియంత్రణ) చట్టం, 2010కి పార్లమెంట్ సవరణలు చేసింది.

దీని ప్రకారం ఎన్జీవోలు విదేశీ నిధులను పొందాలంటే న్యూఢిల్లీలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతా నుంచి మాత్రమే తీసుకోవాలి.ఎఫ్‌సీఆర్ఏ విదేశీ విరాళాలను నియంత్రిస్తుంది.1976లో అమల్లోకి వచ్చిన ఈ చట్టం 2010లో, తదనంతర కాలంలో 2020లో పార్లమెంట్ సవరించింది.ఇలాంటి వాటి వల్ల దేశ అంతర్గత భద్రతపై ఎలాంటి ప్రతికూల ప్రభావం పడకుండా చూస్తుంది.

Telugu Delhi, Ministry, Khalistani, Sbi Bank-Telugu NRI

విదేశీ విరాళాలు కోరుకునే అన్ని స్వచ్ఛంద సంస్థలు మార్చి 31 లోగా ఎస్‌బీఐ శాఖలో సూచించిన ఎఫ్‌సీఆర్ఏ ఖాతాను తెరవాలి.అయితే ఎన్‌జీవోలు తమ ప్రస్తుత ఎఫ్‌సీఆర్ఏ ఖాతాను ఇతర బ్యాంకుల నుంచైనా కొనసాగించవచ్చు.కానీ న్యూఢిల్లీలోని ఎస్‌బీఐ శాఖతో అనుసంధానించాలి.ఎన్‌జీవోలు, బ్యాంకులు కొత్త నిబంధనలకు లోబడి ఉండటానికి హోంమంత్రిత్వ శాఖ వరుస మార్గదర్శకాలను, చార్టర్లను రూపొందించింది.

బ్యాంకుల విషయానికి వస్తే… బ్యాంకింగ్ ద్వారా మాత్రమే విదేశీ సహకారాన్ని పొందాల్సి వుంటుంది.ఎఫ్‌సీఆర్ఏ, 2010 నిబంధనలను ఎన్జీవో లేదా బ్యాంక్‌లు ఉల్లంఘించినట్లయితే ప్రభుత్వం జరిమానా విధించవచ్చు.

ఓసీఐ లేదా పీఐఓ కార్డ్‌దారుల వంటి భారత సంతతికి చెందిన విదేశీయులతో సహా ఏదైనా విదేశీయుడు, విదేశీ వనరులు భారత కరెన్సీ రూపంలో ఇచ్చే విరాళాలు కూడా విదేశీ విరాళాలుగానే పరిగణించాలి.కాగా, భారతదేశంలో వేర్పాటువాద ఖలీస్తానీ అనుకూల కార్యకలాపాలకు మద్ధతుగా నిలుస్తున్న సిక్కు గ్రూప్ (ఎస్ఎఫ్‌జే)పై ఇటీవల జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కేసు నమోదు చేసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube