మహిళల ఆస్తి విషయంలో సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. !

మహిళల కుటుంబ ఆస్తుల విషయంలో ఉన్న వివాదాలు ఎన్నో.సాధారణంగా భర్త తరపున ఆస్తికి ఆ భార్యకు హక్కు ఉంటుందని తెలిసిందే.

 Supreme Court Sensational Verdict On Womens Property, Supreme Court, Issues, Sen-TeluguStop.com

అయితే తల్లిగారి తరపున ఆస్తికి కూడా ఒక కూతురిగా భాగం ఉందని కోర్టు తీర్పు వెలువరించింది.

ఇదిలా ఉండగా ఈ ఆస్తుల పంపకం విషయంలో సుప్రీంకోర్టు మరో కీలక తీర్పు ఇచ్చింది.

హిందూ మహిళలు తమకు భర్త తరఫు నుండి వచ్చిన ఆస్తులను పుట్టింటి వారికి ఇవ్వొచ్చని సంచలన తీర్పును సుప్రీంకోర్టు ఇచ్చింది.అయితే ఈ తీర్పుకు ముఖ్య కారణం జగ్నో అనే మహిళట.

ఇకపోతే 1953 లో జగ్నో భర్త షేర్‌ సింగ్‌ మరణించగా, అతడికి వారసత్వంగా వచ్చిన ఆస్తి అతని భార్యగా జగ్నోకు సంక్రమించాయి.ఇట్టి ఆస్తిని తమ సోదరుడి కుమారులకు పంచేందుకు జగ్నో నిర్ణయం తీసుకుందట.

ఈ అంశం పై భర్త తరపు వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టును ఆశ్రయించాగా ఈ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ వాఖ్యలు చేసిందట.మొత్తానికి భర్త లేని ఆవిడ ఆస్తిని ఎవరికైన పంచే అధికారాన్ని సుప్రీం కోర్ట్ ఇచ్చిందన్న మాట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube