స్వాతంత్య్ర వేడుకలు ఇలా.. సుప్రీం మార్గదర్శకాలు

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా కరాళ నృత్యం చేస్తుంది.దేశ వ్యాప్తంగా రోజుకు కరోనా కేసులు దాదాపుగా లక్ష ఉంటున్నాయి.

 Supreme Court Give The Instruct To India Indipendence Day Celabrations, India, S-TeluguStop.com

రోజుకు లక్ష కేసులు నమోదు అవుతున్న ఈ సమయంలో స్వాతంత్య్ర వేడుకలు అంటూ దేశ వ్యాప్తంగా భారీ ఎత్తున హంగామా చేసినట్లయితే కేసుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని ఎట్టి పరిస్థితుల్లో వేడుకలు నిర్వహించవద్దని సామాజిక దూరం పాటిస్తూ మాస్క్‌లు ధరించి కొద్ది మంది మాత్రమే స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొనాల్సిందిగా సుప్రీం కోర్టు మార్గదర్శకాలు జారీ చేసింది.

దేశంలోని అన్ని కోర్టులు మరియు ప్రభుత్వ కార్యాలయాల్లో ఎప్పటిలాగే స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా జెండా వందనం జరగాలి.

కాని అది కేవం 20 నిమిషాల్లో పూర్తి అవ్వాలన్నారు.జెండా వందనం తర్వాత సాంస్కృతిక కార్యక్రమాల పేరుతో వేడుకలు నిర్వహించవద్దని ఆదేశించింది.ఇక 50 మందికి ఎక్కడ ఎక్కువ అవ్వద్దు.బౌతిక దూరం పాటించడంతో పాటు ప్రతి ఒక్కరు కూడా మాస్క్‌ ను ధరించాల్సిందే.

వృద్దులను మరియు పిల్లలను ఈ వేడుకల్లో భాగస్వామ్యం చేయవద్దని కూడా కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. ఆగస్టు 15 అంటే దేశ వ్యాప్తంగా పండుగ దినం.

కాని ఈసారి మాత్రం చాలా ఇబ్బందులు మరియు ఆంక్షల మద్య ఆ పండుగ జరుపుకోవాల్సి వస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube