ఇరాన్ పౌరులకి వీసాలు జారీ నిలిపేసిన భరత్ ప్రభుత్వం

కరోనా వైరస్ చైనాని, హాంకాంగ్ ని ఓ వైపు నాశనం చేస్తూనే మెల్లగా ఆసియా దేశాలైన చైనాతో దక్షిణ కొరియా, ఉత్తర కొరియా, ఇరాన్ లాంటి దేశాలకి విస్తరించింది.అయితే ఇండియాలో కూడా ఈ కేసులో కేరళలో కొన్ని నమోదైన కూడా వాటిని వెంటనే కంట్రోల్ లోకి తీసుకొచ్చారు.

 India Stops Visa For Iranians 1-TeluguStop.com

ఈ వైరస్ ప్రభావం ఆయా దేశాలలో ఎక్కువగా ఉండటంతో ఇప్పటికే చాలా దేశాలు చైనా, హాంకాంగ్ తో పాటు కొన్ని దేశాలలో సంబంధాలు తేన్చుకుననాయి.ఆయా దేశాలకి వీసా జారీని నిలిపివేస్తుననాయి.

ఇప్పటికే ఇండియా కూడా చైనాతో పాటు, దక్షిణ కొరియా, హాంకాంగ్ దేశాలకి వీసాల జారీని నిలిపేసింది.ఇప్పుడు తాజాగా ఇరాన్ పౌరులు దేశంలోకి అడుగుపెట్టకుండా వారికి వీసాల జారీ ప్రక్రియను నిలిపివేసింది.

చైనా తర్వాత కరోనా వైరస్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నది ఇరాన్‌లోనే.ఈ నేపథ్యంలోనే భారత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

కరోనా కారణంగా ఇరాన్‌లో ఇప్పటి వరకు 43 మంది ప్రాణాలు కోల్పోగా, 600 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.ఇక కరోనా విస్తృతంగా వ్యాపించే దేశాల విషయంలో భారత్ ప్రభుత్వం కఠినంగా వ్యవరించాలని నిర్ణయించుకుంది.

ఈ ప్రభావం ఇండియా మీద పడకుండా ఉండటానికి అన్ని అవకాశాలని భారత ప్రభుత్వం ఉపయోగించుకుంటుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube