స్టార్ బౌలర్ సిరాజ్ ను అంతలా దూషించారట.. కానీ ఇప్పుడు

ఇండియాలో క్రికెట్  ఓ మతం.కావున క్రికెట్ ఆడే వారిని ఫ్యాన్స్ నచ్చితే తల ఎత్తుకుంటారు.

 India Star Bowler Siraj Was Blamed So Much But Now Details, Siraj, Bcci, Team In-TeluguStop.com

నచ్చలేదో సరైన ప్రదర్శన చేయలోదే పొగిడిన నోటితోనే తిట్ల పురాణం చదువుతారు.వారు ఊరికే విమర్శలు చేయడం మాత్రమే కాకుండా డైరెక్టుగా సోషల్ మీడియాలో విమర్శలు చేస్తూ సదరు క్రికెటర్ ను ట్యాగ్ చేస్తారు.

అంతే కాకుండా ఒక్కో సారి తిట్టిన క్రికెటర్ నే పొగుడుతారు.ఇదే విషయం జరిగిందని చెబుతున్నాడు.

టీమిండియా నయా సంచలనం, హైదరాబాదీ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్. అసలు సిరాజ్ విషయంలో ఏం జరిగిందంటే….

మహ్మద్ సిరాజ్ 2017లోనే న్యూజిలాండ్ తో టీ20ల ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చాడు.కానీ అప్పుడు అతడు దారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు.

ఆ సిరీస్ తర్వాత జరిగిన 2018 సీజన్ ఐపీఎల్లో బెంగుళూరు రాయల్ చాలెంజర్స్ తరఫున ఆడిన సిరాజ్ తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు.దీంతో క్రికెట్ ఫ్యాన్స్ అతడిపై దారుణ ట్రోలింగ్ చేశారు.

కొందరైతే సిరాజ్ ను నీ అయ్యలాగ నువ్వు కూడా ఆటో నడుపుకో అని అన్నారట.తాజాగా ఈ విషయాలను గుర్తు చేసుకుని సిరాజ్ భావోద్వేగానికి గురయ్యాడు.

సిరాజ్ తండ్రి హైదరాబాద్ లో ఆటో డ్రైవర్ గా పని చేస్తూ ఉండే వాడు.కానీ సిరాజ్ ఆ వ్యాఖ్యలకు కుంగిపోలేదు.

Telugu Australia, Auto, Bcci, Hyderabad, Mohammad Siraj, Siraj-Latest News - Tel

సరికదా మరింత కసిగా ఆడాడు.ఇలా 2020 ఐపీఎల్లో అద్భుతంగా రాణించాడు.దాంతో అతడికి ఆస్ట్రేలియా టెస్టులు ఆడే అవకాశం వచ్చింది.దురదృష్టవశాత్తు సిరాజ్ ఆసీస్ లో ఉన్న సమయంలోనే అతడి తండ్రి హైదరాబాద్​ లో మరణించాడు.కానీ సిరాజ్ మాత్రం టెస్టు సిరీస్ చేయబట్టి రాలేకపోయాడు.ఇక అదే సిరీస్ లో గబ్బా వేదికగా టెస్టుల్లోకి ఆరంగ్రేటం చేసిన సిరాజ్ తన సత్తాను చాటాడు.

ఐదు వికెట్ల ప్రదర్శనతో విమర్శకుల నోళ్లు మూయించాడు.ఇక సిరాజ్ తో పాటు మిగతా వారు కూడా రాణించడంతో ఆ సిరీస్ ని ఇండియా కైవసం చేసుకుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube