ఆ విషయంలో అమెరికాని కూడా దాటేసింది ఇండియా     2017-01-18   02:28:14  IST  Raghu V

ఒక పిచ్చి పట్టుకోవాలే కాని, అది వ్యసనంగా మారిపోతుంది భారతీయులకు. అదేం అలవాటో కాని మన అలవాట్లు రోజురోజుకి ముదిరిపోతాయి తప్ప వాటిని వదిలేయడం అంటే దాదాపుగా జరగని పని. ఇప్పుడు మీ ఇంట్లోనే చూసుకోండి. ఎపుడూ స్మార్ట్ ఫోన్ పట్టుకొని కూర్చునే పిల్లలు పెద్దలు ఉన్నారా లేరా ! ప్రతి ఇంట్లో ఖచ్చితంగా ఉంటారు. అందుకే మన దేశం మొబైల్ యాప్స్ కి బానిసై కూర్చుంది.

వేరే దేశాలలో కూడా స్మార్ట్ ఫాన్స్, యాప్స్ వాడుతున్నారు, కాదనట్లేదు కాని, మరీ మన దేశంలో ఉన్నంత విపరీరమైన వ్యసనం మాత్రం లేదు. ఇంత ఖచ్చితంగా ఎలా చెబుతున్నాం అంటే, ప్రపంచంలో అత్యధికంగా మొబైల్ యాప్స్ డౌన్లోడ్ చేస్తున్న దేశం భారత్ కాబట్టి.

అప్ అన్ని అనే అనలిటిక్స్ సంస్థ అందించిన రిపోర్టు ప్రకారం, మొబైల్ యాప్ దౌన్లోడ్స్ లో ఏకంగా అమెరికాను దాటేసింది ఇండియా. 2015 సంవత్సరం మొత్తంలో మన దేశంలో 3.5 బిలియన్ల యాప్ డౌన్లోడ్స్ జరిగితే, 2016వ సంవత్సరంలో ఏకంగా 6 బిల్లియన్ల మొబైల్ యాప్ డౌన్లోడ్స్ చేసారట భారతీయులు. మన దేశంలో యాప్స్ పై గడిపే సమయం కూడా బాగా పెరిగిందట.

ఇక ప్రపంచవ్యాప్తంగా గత ఏడాది యాప్ పబ్లిషర్స్ సంపాదించిన రెవెన్యు ఏంతో తెలుసా ? 89 బిలియన్ డాలర్లు. అంటే ఆరు లక్షల కోట్ల పైమాటే. చూసారా ప్రపంచం మొత్తం స్మార్ట్ ఫోన్స్ కి ఎంతలా అతుక్కుపోతోందో !