ఇమ్మిగ్రేషన్ నిబంధనలు, జాత్యహంకార దాడులు: ఏం జరిగినా అమెరికాకే ఓటు అంటున్న భారతీయులు  

After China India Sent Over 202,000 Students To Us In 2018-19-china,india Sent Over 202,nri,telugu Nri News Updates

మా ఉపాధి అవకాశాలు కొట్టేస్తున్నారని సగటు అమెరికా పౌరుడు ఆక్రోశం వ్యక్తం చేస్తున్నా… అసహనంతో, జాత్యహంకార దాడులకు పాల్పడుతున్నా.అమెరికా ఫస్ట్ నినాదంతో అగ్రరాజ్యాధినేత వీసా, ఇమ్రిగ్రేషన్ నిబంధనల్లో మార్పులు చేసినా.ఫార్మింగ్టన్ యూనివర్సిటీ వంటి నకిలీ ఘటనలు వెలుగు చూస్తున్నా అమెరికాలో చదువుకునేందుకు, స్ధిరపడేందుకు భారతీయుల్లో ఆసక్తి మాత్రం తగ్గడం లేదు.

After China India Sent Over 202,000 Students To Us In 2018-19-china,india Sent Over 202,nri,telugu Nri News Updates-Telugu Trending Latest News Updates-After China India Sent Over 202 000 Students To US In 2018-19-China India Nri Telugu Nri News Updates

అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఉన్నత విద్యను అభ్యసించే భారతీయుల సంఖ్య 2018తో పోలిస్తే 2.9 శాతం పెరిగిందని… ఆ దేశ విదేశాంగ శాఖకు చెందిన విద్య, సాంస్కృతిక వ్యవహారాలను పర్యవేక్షించే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ నివేదిక వెల్లడించింది.ఈ జాబితాలో చైనా విద్యార్థులు అగ్రస్థానంలో ఉన్నారు.

2018-19 విద్యా సంవత్సరంలో 10 లక్షల మందికి పైగా విదేశీ విద్యార్థులు అమెరికాకు వెళ్లగా.వీరిలో 3.69 లక్షల మంది చైనీయులు, 2,02,014 మంది భారతీయులు ఉన్నారు.విదేశీ విద్యార్థుల కారణంగా 2018లో అమెరికా ఖజానాకు 44.7 బిలియన్ డాలర్ల ఆదాయం లభించింది.మరోవైపు ఇదే సమయంలో భారత్, చైనాలతో పాటు బంగ్లాదేశ్, బ్రెజిల్, నైజీరియా, పాకిస్తాన్ ‌నుంచి కూడా విద్యార్ధుల సంఖ్య పెరుగుతున్నట్లు నివేదిక వెల్లడించింది.