44 ఏళ్లలో ఇదే తొలిసారి!

ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా వర్షాలు మెండుగా కురిశాయి.దాని ఫలితంగా ఎప్పుడు వెలవెలబోతూ ఉండే నదులు,ప్రాజెక్టులు ఇప్పుడు నిండుకుండలా కళకళలాడుతున్నాయి.

 In 44 Years This Is First Time Of Heavy Rains In India. Heavy Rains, India, Indi-TeluguStop.com

ఈ సంవత్సరం కురిసిన వర్షాలు అతివృష్టి అని దాని ఫలితంగానే దేశంలోని పలు చోట్ల వరదలు నమోదయ్యాయని వాతావరణ విభాగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.ఒక్క మన దేశంలోనే కాకుండా ఈసారి చైనాలో కూడా భారీ వర్షాలు కురిశాయి.

ఇలాంటి వర్షపాతం 80 ఏళ్లలో ఎప్పుడూ లేదని చైనా వాతావరణ విభాగ నిపుణులు చెబుతున్నారు.మన దేశంలోని వాతావరణ నిపుణులు అభిప్రాయపడినట్లు ఈసారి కురిసిన వర్షాలు 44 ఏళ్లలో ఇదే తొలిసారని భారత వాతావరణ విభాగం ధృవీకరించింది.

ఈసారి ఆగస్టులో సాధారణంగా కురిసే వర్షం కంటే 27 శాతం ఎక్కువగా వర్షపాతం నమోదు అయిందని ఈ స్థాయిలో వర్షపాతం నమోదు అవ్వడం 44 ఏళ్లలో ఇదే తొలిసారని 120 ఏళ్లలో అధిక స్థాయి వర్షపాతం నమోదవ్వడం ఇది నాలుగోసారని భారత వాతావరణ విభాగం అంటుంది.గతంలో 1926లో 33 శాతం, 1973లో 27.8 శాతం,1976లో 28.4 శాతం,2020 ఆగస్ట్ లో 27 శాతం అధిక వర్షపాతం నమోదు అయిందని భారత వాతావరణ విభాగం గణాంకాలను విడుదల చేసింది

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube