కరోనా రికవరీ కేసుల్లో భారత్ ప్రథమ స్థానం..!

ప్రపంచవ్యాప్తంగా కరోనా శరవేగంగా వ్యాప్తి చెందుతోంది.రోజూ రాష్ట్రాలవ్యాప్తంగా కరోనా కేసులు వేలల్లో నమోదవుతూనే ఉన్నాయి.

 India Ranks First In Corona Recovery Cases  India, Ranks First, Corona, Recovery-TeluguStop.com

కరోనా కేసుల పెరుగుదలతో పాటు దేశంలో కరోనా రికవరీ రేటు కూడా అధికంగా ఉంది.రికవరీ రేటు భారత్ అగ్రస్థానంలో నిలిచిందని, అమెరికా దేశంను అధిగమించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

ప్రస్తుతం దేశంలో కరోనాతో రికవరీ అవుతున్న వారీ సంఖ్య 42 లక్షలకు దాటిందని పేర్కొంది.కరోనాను నిర్ధారించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యేక చర్యలు, బాధితులకు అందిస్తున్న చికిత్స, అవగాహన కార్యక్రమాల వల్లే ఇందంతా సాధ్యమైందని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.

తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ కరోనా హెల్త్ బులిటెన్ ను విడుదల చేసింది.గడిచిన 24 గంటల్లో దేశంలో 93,337 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి.దీంతో దేశంలో మొత్తంగా నమోదైన కేసుల సంఖ్య 53 లక్షలపైగా దాటింది.నిన్న ఒక్కరోజే 1,247 మంది కరోనా బారిన పడి ప్రాణాలు విడిచారు.

దీంతో ఈ మహమ్మారి వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 85,619కి చేరింది.ప్రస్తుతం దేశంలో 10,13,964 యాక్టివ్ కేసులు ఉన్నాయని, ఇప్పటివరకూ కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 42,08,432 చేరిందని కేంద్ర ఆరోగ్యశాఖ తాజాగా ప్రకటించింది.

రికవరీ రేటు పెరిగిందని అజాగ్రత్తగా ఉండకుండా.కరోనా పూర్తిస్థాయిలో నిర్మూలించేవరకు ప్రజలు నిబంధనలు పాటించాలని సూచించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube