2027 నాటికి చైనాని మించిపోతున్న భారత్  

2027 నాటికి జనాభాలో చైనాని మించిపోతున్న ఇండియా. .

India Population Will Increase In 2027 Than China-

ప్రతి ఏడాది ప్రపంచ జనాభా పెరిగిపోతోంది.అయితే అందుకు తగ్గట్టు వనరులు మాత్రం లభించడం లేదు.ఇక చైనా భారత్ లాంటి దేశాలలో అయితే జనాభా వృద్ధిరేటు గణనీయంగా పెరిగి పోతుంది..

India Population Will Increase In 2027 Than China--India Population Will Increase In 2027 Than China-

వృద్ధుల సంఖ్య తగ్గిపోతూ యువశక్తితో భారత్ అభివృద్ధి పథంలో దూసుకెళ్తుంది.ఇదిలా ఉంటే రానున్న మూడు దశాబ్దాల్లో ప్రపంచ జనాభా 200 కోట్లు పెరుగుతుందని, 2050 నాటికి 970 కోట్ల స్థాయికి ప్రపంచ జనాభా చేరుకుంటుందని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది ‌ ఇక రానున్న ఎనిమిదేళ్ల కాలంలో జనాభా సంఖ్య లో భారత్ చైనా ను అధిగమించి చేస్తుందని ఐక్యరాజ్యసమితి తన నివేదికలో అంచనా వేసింది.

2019 – 2050 మధ్య కాలంలో భారత్ మరో 28 కోట్ల జనాభా పెరిగే అవకాశాలున్నాయని ఈ శతాబ్ది చివరి నాటికి ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ మారుతుందని తెలిపింది.అలాగే ఐరాస అంచనా ప్రకారం నైజీరియాలో 20 కోట్ల మంది జనాభా పెరుగుతుందని తెలుస్తుంది.ఈ రెండు దేశాల జనాభా ప్రపంచం మొత్తం జనాభాలో 23 శాతం ఉంటుందని తమ నివేదికలు తెలియజేసింది.అలాగే 2050నాటికి ప్రకృతి వనరుల వినియోగం ప్రపంచంలో రెట్టింపు అవుతుందని ఐరాస అంచనా వేసింది.జనాభా పెరుగుదలతో పాటు యువశక్తి భారత్లో ఎక్కువగా ఉండగా చాలా దేశాల్లో వృద్ధుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని తమ నివేదికలో తెలియజేశారు.