అమెరికాలో భారత ఎన్నారై 65 కోట్ల మోసం..  

India-origin Former Cisco Employee Arrested In Usa-cisco Products,prithviraj Bhikha,rs 65 Cr Fraud,san Francisco Air Port

తిన్న ఇంటివాసలు లెక్కపెట్టడం అంటే ఇదేనేమో. అమెరికాలో సిస్కో కంపెనీలో పని చేస్తున్న భారత ఎన్నారై పృధ్వీరాజ్ సదరు కంపెనీ నుంచీ 65 కోట్లు కాజేశాడు. 2017 వరకు సిస్కో కంపెనీ గ్లోబర్ సప్లై యూనిట్ కి డైరెక్టర్ గా పని చేసిన ఆయన దాదాపు 2013 నుంచీ ఆ కంపెనీని మోసం చేస్తూ వచ్చినట్టుగా తెలుస్తోంది...

అమెరికాలో భారత ఎన్నారై 65 కోట్ల మోసం..-India-origin Former Cisco Employee Arrested In USA

పృధ్వీరాజ్ 2013లో సిస్కో కంపెనీ వస్తువుల తయారీ దారులు , థర్డ్ పార్టీ వెండార్స్‌‌ సేవింగ్స్ విషయంలో కలిసి చర్చలు జరుపుకునేలా ఓ కొత్త ప్రాజెక్ట్ ని తయారు చేసినట్టు కంపెనీ కి తెలిపారు. ఆ తరువాత తానే సొంతంగా ఓవర్సీస్ వ్యాపార సంస్థలను ఏర్పాటు చేసి, సిస్కో కంపెనీ కాంట్రాక్టు లని తన కంపెనీకి వచ్చేలా చేసుకున్నాడు.

ఇలా దాదాపు సిస్కో నుంచీ రూ.45 కోట్ల 54 లక్షలు ఒక కంపెనీకి, అదే విధంగా రూ.19 కోట్ల 63 లక్షలు మరోక కంపెనీకి మళ్ళించాడు. ఆ మొత్తం డబ్బు ఆయన భార్య బ్యాంక్ అకౌంట్ కి మళ్లించినట్టుగా తేలింది.

అయితే పృధ్వీ చేసిన కుట్రని కనిపెట్టిన యాజమాన్యం ఆయనపై పోలీసులకి ఫిర్యాదు చేయడంతో శాన్‌ఫ్రాన్సిస్కో ఎయిర్పోర్ట్ లో ఆయన ఉండగా అరెస్ట్ చేశారు.