సింధు జలాల ఒప్పందం గురించి.. పాకిస్తాన్ కు భారత్ నోటీసులు..

భారత్ పాకిస్తాన్ మధ్య దశాబ్దాల క్రితం నాటి సింధు నది జలాల పంపిణీ ఒప్పందం మరోసారి తెరపైకి వచ్చింది.ఈ సింధూ నది ఒప్పందాన్ని సవరించాలంటూ పాకిస్తాన్ కు భారతదేశం నోటీసులు పంపించింది.

 India Notices To Pakistan About The Indus Waters Agreement , Pakistan, Internati-TeluguStop.com

ఒప్పందం అమలు విషయంలో పాకిస్తాన్ అనుసరిస్తున్న మొండి వైఫరిని భారత్ తీవ్రంగా వ్యతిరేకరించింది.సింధూ నది జలాల ఒప్పందానికి సంబంధించిన కమిషనర్ల ద్వారా జనవరి 25 పాకిస్తాన్ కు నోటీసులు పంపినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

Telugu Beas, Chenab, International, Jhelum, Pakistan, Sindus, Ravi, Sutlej-Natio

ఈ ఒప్పందం అమలు లో దశాబ్దాలుగా విభేదాలు కొనసాగుతున్నాయి.సింధూ నది జలాల ఒప్పందం అమలుకు అడ్డంకి కలిగించేలా పాకిస్తాన్ చర్యలు ఉన్నాయి.ఈ చర్యలు ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉన్నాయి.నోటీసు అందుకున్న 90 రోజుల్లోనే భారత్ పాకిస్తాన్ మధ్య చర్చలు జరగాల్సి ఉంది.గత 62 సంవత్సరాలుగా నేర్చుకున్న పాఠాలతో ఒప్పందాన్ని సవరించుకొని ముందుకు సాగే ఒప్పందాన్ని అవకాశం లభిస్తుందని ఆ వర్గాలు వెల్లడించాయి.

Telugu Beas, Chenab, International, Jhelum, Pakistan, Sindus, Ravi, Sutlej-Natio

భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో పారే సింధు ఉన్నది జలాల పంపిణీ పై 1960లో ఒప్పందం జరిగింది.దీని ప్రకారం సింధు ఉపనదుల్ని తూర్పు, పశ్చిమ నదులుగా విభజించారు.సట్లెజ్,బియాస్, రావి తూర్పు నదుల జలాలను భారతదేశం ఉపయోగించుకోవచ్చు.

జీలం, చీనాబ్, సింధులను పశ్చిమ నదులుగా విభజించి వాటిపై హక్కులన్నీ పాకిస్తాన్ కు ఇచ్చారు.అయితే పశ్చిమ నదుల్లో జల విద్యుత్, వ్యవసాయ అవసరాలకు నీటిని భారత్ కూడా ఉపయోగించుకునే హక్కు ఉంది.ఇంకా చెప్పాలంటే ఈ ఒప్పందం అమలును పర్యవేక్షించడానికి శాశ్వత సింధు కమిషన్ ఏర్పాటు కూడా చేశారు.2017- 2022 ల మధ్య ఐదు సార్లు సమావేశమైన సమస్యలపై ఏకాభిప్రాయం కుదరలేదు.అయితే చివరికి భారతదేశం ఆ ఒప్పందాన్ని మారుద్దాం అంటూ పాకిస్తాన్ కు నోటీసులు పంపింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube