మ‌ళ్లీ బెంబేలెత్తిస్తున్న క‌రోనా... థ‌ర్డ్ వేవ్‌కు ఈ ఒక్క సంకేతం చాలు!

న్యూఢిల్లీ: దేశంలో గ‌డ‌చిన 24 గంట‌ల్లో కొత్త‌గా 41,965 క‌రోనా పాజిటివ్ కేసులు ప‌మోద‌య్యాయి.దీంతో దేశంలో మొత్తం న‌మోదైన క‌రోనా కేసుల సంఖ్య 3,28,10,845కి చేరింది.

 India New Corona Cases 32 Percent Increase In The Last 7 Days, Corona Third Wave-TeluguStop.com

గ‌డ‌చిన 24 గంట‌ల్లో కరోనాతో 460 మంది చనిపోయారు.దేశంలో మొత్తం క‌రోనా మృతుల‌ సంఖ్య 4,39,020కి చేరింది.ప్ర‌స్తుతం క‌రోనా మరణాల రేటు 1.3 శాతంగా ఉంది.ప్రపంచ దేశాల్లో ఇది 2.07 శాతం.గ‌డ‌చిన 24 గంట‌ల్లో కొత్తగా 33,964 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు.మొత్తంగా క‌రోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,19,93,644కి చేరింది.క‌రోనా రికవరీ రేటు 97.5 శాతంగా ఉంది.ప్రస్తుతం దేశంలో 3,78,181 యాక్టివ్ కేసులు ఉన్నాయి.దేశవ్యాప్తంగా గ‌డ‌చిన 24 గంట‌ల్లో 16,06,785 క‌రోనా టెస్టులు చేశారు.తాజాగా కేరళలో కొత్తగా 30వేల క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి.
అదేవిధంగా ఆ రాష్ట్రంలో క‌రోనాతో గ‌డ‌చిన 24 గంట‌ల్లో 115 మంది మృతి చెందారు.

గత వారానికీ, ఈ వారానికీ దేశంలో కొత్తగా న‌మోదైన‌ కేసులు 32 శాతం మేర‌కు పెరిగాయి.ఈ పెరుగుద‌ల థ‌ర్డ్ వేవ్ ను సూచించేదిగా ఉంద‌ని నిపుణులు భావిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube