కరోనా పోరులో భారత్ మెరుగైన స్థానంలో ఉంది -ప్రధాని మోదీ

కరోనా పోరులో భారత్ మెరుగైన స్థానంలో ఉందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.సరైన సమయంలో కీలక నిర్ణయాలు తీసుకోవడం ద్వారానే ఇది సాధ్యమైందని వ్యాఖ్యానించారు.

 India, Pm Narendra Modi, Corona Battle, Better Position, Icmr, Noida, Mumbai, Ko-TeluguStop.com

సోమవారం భారత్ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) ఆధ్వర్యంలో అత్యాధునిక సౌకర్యాలు కలిగిన కరోనా పరీక్షా కేంద్రాలను నోయిడా, ముంబయి, కోల్‎కతాలో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు.వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మోదీ ప్రారంభించిన కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్, మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.ఐసీఎంఆర్ ఆధ్వర్యంలోని నూతన హైటెక్ పరీక్షా కేంద్రాలు అందుబాటులోకి రావడం దేశం కొనసాగిస్తున్న కరోనా పోరుకు మరింత బలాన్ని చేకూర్చాయని అన్నారు.

వీటి ద్వారా ప్రతిరోజు అదనంగా మరో 10 వేల పరీక్షలు చేయగలిగే సామర్ధ్యం చేకూరిందని అన్నారు.దేశవ్యాప్తంగా కరోనా పరీక్షల నిర్వాహణ సామర్ధ్యం పది లక్షలకు పెంచేందుకు కృషి చేస్తున్నట్లు ప్రకటించారు.

ఈ పరీక్షా కేంద్రాలను కరోనా టెస్టుకు మాత్రమే కాకుండా డెంగ్యూ, హెపటైటిస్ వంటి పలు రకాల టెస్టుల నిర్వాహణకు కూడా వాడుకోవచ్చని స్పష్టం చేశారు.ప్రస్తుత్తం 1300 పరీక్షా కేంద్రాలు రోజుకి ఐదు లక్షల కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నాయని ప్రధాని మోదీ తెలిపారు.

మరోవైపు దేశవ్యాప్తంగా 11 వేల కరోనా కేంద్రాలు, 11 లక్షల ఐసోలేషన్ బెడ్లు ఉన్నట్లు వెల్లడించారు.

ఇక కరోనా పోరులో వైద్య ఆరోగ్య సిబ్బంది, ఏఎన్ఎమ్‎లు, అంగన్‎వాడీ, ఇతర సిబ్బంది పాత్రను ప్రధాని మోదీ ప్రశంసించారు.

వీరంతా కరోనాపై పోరులో కీలకంగా వ్యవహరించారని కొనియాడారు.ఒకానొక సమయంలో భారత్‎లో ఒక్క పీపీఈ కిట్ కూడా తయారు చేసే సామర్థ్యం లేదని.

, ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా పీపీఈ కిట్ల తయారీలో భారత్ రెండో స్థానంలో నిలిచిందని అన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube