భారత్ ఇన్ని కష్టాలు ఎదుర్కోవాల్సిందేనా ? ప్రపంచ బ్యాంకు ఏం చెబుతోంది ?

ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కరోనా వైరస్ తలకిందులు చేసింది.ఈ వైరస్ కారణంగా ఏర్పడిన సంక్షోభం నుంచి భారత్ కోలుకోవాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది.

 Corona Effect On Indian Financial Status Says In World Bank, Corona Virus, India-TeluguStop.com

ఇప్పటి కే అన్ని వర్గాల, అన్ని ప్రాంతాల ప్రజలు ఈ వైరస్ కారణంగా తీవ్రంగా నష్టపోయారు.ముఖ్యంగా దక్షిణాసియా మొత్తం కోలుకోని విధంగా నష్టపోయింది.

బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ఒక రకంగా ఇబ్బంది పడుతుంటే, భారత్ మాత్రం మరో రకంగా ఇబ్బంది పడుతోంది.దక్షిణాసియా దేశాలలో పెద్ద దేశమైన భారత ఆర్థిక వ్యవస్థకు కోలుకోలేని విధంగా నష్టం చేకూరింది.

ఈ విషయాన్ని స్వయంగా ప్రపంచ బ్యాంకు తేల్చి చెప్పింది.భారత వృద్ధి రేటు 2021 సంవత్సరం నాటికి 2.8% దాటడం కష్టం అని తేల్చి చెప్పేసింది.ప్రస్తుతం భారత దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ నిబంధన అమలవుతోంది.

ఈ లాక్ డౌన్ నిబంధనలు సడలించిన తరువాత కూడా భారత ఆర్థిక వ్యవస్థ కుడుటపడే అవకాశం కనిపించడంలేదు.

Telugu Lakhs, Afganisthan, Coporate, Corona, India Lock, Bank-Political

ఆర్థిక వ్యవస్థ కుదుట పడాలంటే తయారీ రంగానికి ఎగుమతులు ఎక్కువ సంఖ్యలో ఉండాలి.అలా జరగాలంటే విదేశీ పెట్టుబడులు, విదేశీ ఇన్వెస్టర్ల అంతా మన దేశంపై దృష్టి పెడితే అన్ని రకాల ఫ్యాక్టరీలు నిరంతరంగా పనిచేస్తాయి.విమానాల రాకపోకలు యధావిధిగా కొనసాగాలి.

అలాగే విదేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు భారత్ కు ర్ఫాకపోకలు కొనసాగించాలి.అప్పుడే పర్యాటక రంగం కూడా గాడిలో పడుతుంది.

రోడ్లపై జనాలు యధావిధిగా తిరిగితేనే మళ్ళీ మార్కెట్ పుంజుకుంటుంది.కానీ జనాలు ఆ విధంగా తిరిగే పరిస్థితి కనిపించడం లేదు.

ఇక ఈ కరోనా వైరస్ కారణంగా ఉపాధి ఉద్యోగ అవకాశాలు కోల్పోయిన వారికి మళ్లీ ఉపాధి లభించాల్సి ఉంది.అలా జరగాలంటే ఇప్పటివరకు మూతపడిన ఫ్యాక్టరీలు, కార్యాలయాలు యధావిధిగా తెరుచుకోవాలి.

అదే విధంగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కడికక్కడ రవాణా స్తంభించిపోయింది.రవాణా పూర్తిగా స్తంభించి పోవడంతో రాకపోకలు సాగడంలేదు.

Telugu Lakhs, Afganisthan, Coporate, Corona, India Lock, Bank-Political

మొత్తంగా దేశంలో 50 లక్షల వరకు ట్రక్కులు ఉంటే, ఇప్పుడు కేవలం నాలుగు లక్షల ట్రక్కులు మాత్రమే అత్యవసర పనులు నిమిత్తం రోడ్లపై తిరుగుతున్నాయి.అదీ కాకుండా భారత దేశానికి ఇప్పుడు అతి పెద్ద సమస్యగా మారింది.ఏంటి అంటే ఉపాధి.నెలవారీ వేతనం లేని వారికి ఉపాధి అవకాశాలు కల్పించడం చాలా ముఖ్యం.ఇప్పటికే లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన సుమారు 80 కోట్ల మంది పేదలకు నెలకు ఐదు కిలోల బియ్యం అందిస్తోంది.అలాగే జన్ ధన్ ఖాతాల్లో ఐదు వందలు జమ చేస్తోంది కేంద్రం.

అయినా లాక్ డౌన్ మరికొంత కాలం పొడిగించితే వృద్ది రేటు మరింత పడిపోవడంతో పాటు కోలుకోలేని విధంగా భారత్ ఆర్థిక సంక్షోభం ఎదుర్కోవాల్సి ఉంటుంది అంటూ ప్రపంచ బ్యాంక్ అంచనా వేస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube