నేడు,రేపటీలో ప్రధాని కీలక ప్రకటన, నెలాఖరువరకు లాక్ డౌన్ కొనసాగించే అవకాశం

దేశంలో లాక్ డౌన్ పొడిగింపు అభిప్రాయాలే లక్ష్యంగా నేడు ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు ప్రధాని నరేంద్ర మోడీ కూడా మాస్కులు ధరించి మరి పాల్గొన్నారు.

 Pm Video Conference Completed With State's Cm's, India Lock Down, Narendra Modi,-TeluguStop.com

అయితే ఈ సమావేశంలో రాష్ట్రాల సీఎం లు అందరూ కూడా లాక్ డౌన్ ను మరో 15 రోజుల పాటు కొనసాగిస్తేనే కరోనా ను కట్టడి చేయగలం అన్నట్లుగా అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది.ఇప్పటికే ఒడిశా,పంజాబ్ రాష్ట్రాల్లో ఈ నెల 30 వ తేదీ వరకు లాక్ డౌన్ ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

అయితే మిగిలిన రాష్ట్రాల సీఎం లు అందరూ కూడా ఈ మేరకు విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తుంది.అయితే దినసరి కూలీల విషయం లో,గ్రామీణ ప్రాంతాల్లో ఈ లాక్ డౌన్ ను సడలించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.

అయితే ఈ లాక్ డౌన్ అనేది అన్ని రాష్ట్రాల్లో అమలు పరచాలని ఒక్కో రాష్ట్రానికి ఒక్కో తరహా వద్దని సీఎం లు అందరూ అభిప్రాయపడినట్లు తెలుస్తుంది.అలానే వ్యవసాయం,రైతులకు ఈ లాక్ డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చే అవకాశలు కనిపిస్తున్నాయి.

రాష్ట్రాల సీఎం లతో వీడియో సమావేశం నిర్వహించిన మోడీ ప్రజా రోగ్యమే ప్రధాన లక్ష్యంగా అందరూ కృషి చేయాలనీ కోరారు.అయితే 24/7 అందరికి అందుబాటులో ఉంటానని తెలిపిన మోడీ ఎప్పుడైనా ఫోన్ చేసి అయినా మాట్లాడొచ్చు అంటూ సీఎం లకు స్పష్టం చేశారు.

అయితే లాక్ డౌన్ పొడిగింపు పై ఈ రోజు,రేపటి లో మోడీ కీలక ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయి.దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube