మోడీ కా బాత్,ఎకానమీ కంటే జీవితం గొప్పది

కరోనా మహమ్మారి నేపథ్యంలో దేశంలో గత 21 రోజుల నుంచి లాక్ డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే.అయితే నేటితో తొలివిడత లాక్ డౌన్ ముగియనుండడం తో ప్రధాని నరేంద్ర మోడీ జాతిని ఉద్దేశించి మరోసారి మాట్లాడారు.

 Pm Modi Extended Lockdown Period, India Lock Down, Narendra Modi, Corona Virus,-TeluguStop.com

ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ ఎకానమీ కంటే జీవితం అనేది గొప్పది అని మోడీ వ్యాఖ్యానించారు.కరోనా మహమ్మారి నేపథ్యంలో దేశం అమలు పరచిన లాక్ డౌన్ కు ప్రతి ఒక్కరూ చాలా సహకరించారు అని,ఎన్ని ఇబ్బందులు కలుగుతున్నా కూడా ప్రజలు ఎన్నో త్యాగాలు చేసి మరి కరోనా కు వ్యతిరేకంగా పోరాడుతున్నారు అని మోడీ అన్నారు.

సంతృప్తికరంగా ఈ లాక్ డౌన్ అనేది అమలవుతుంది అని మోడీ తెలిపారు.ఈ మహమ్మారి నేపథ్యంలో దేశంలో మరో 19 రోజుల పాటు ఈ లాక్ డౌన్ ను పొడిగించడం అనేది తప్పని సరి అని మోడీ స్పష్టం చేసారు.


ఇప్పటివరకు అమలు అయిన లాక్ డౌన్ సంతృప్తికరంగా అయ్యింది అని ఇది భారతీయ ప్రజల విజయం అని మోడీ అన్నారు. లాక్ డౌన్ సమయంలో ప్రజలు బాగా సహకరించారు అని పండుగలు సైతం ఏంతో నిబద్దతతో జరుపుకున్నారు అని అన్నారు.

తినడానికి,ప్రయాణాలకు ఎందరో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ ప్రస్తుతం భారత్ కు ఇది గడ్డు కాలం అని తప్పనిసరిగా ఈ లాక్ డౌన్ ను పొడిగించక తప్పదు అని మోడీ స్పష్టం చేశారు.ఏప్రిల్ 20 వరకు ఈ కరోనా తీవ్రత ఎక్కువగా ఉంటుంది అని కావున ఏప్రిల్ 20తరువాతే రెడ్ జోన్,హాట్ స్పాట్ లలో సడలింపులు అనేవి జరుపుతామని మోడీ అన్నారు.

కరోనా విషయంలో భారత్ అవలంబిస్తున్న తీరు ప్రపంచ దేశాలకు మార్గనిర్దేశకంగా మారింది అని, ఈ మహమ్మారి విషయం భారత్ పోరాటం చాలా గొప్పగా ఉందంటూ మోడీ కొనియాడారు.

ఏప్రిల్ 20 వరకు ప్రజల శ్రేయస్సు కోసం ప్రస్తుతం ఉన్న నిబంధనలే అమలు చేయాల్సిన అవసరం ఉందంటూ మోడీ స్పష్టం చేశారు.

అయితే మరో విషయం ఏమిటంటే మే 3 తరువాత కూడా కొన్ని నిబంధనలు అమలు చేయాల్సిన అవసరం ఉందంటూ మోడీ అన్నారు.అయితే మే 3 తరువాత ఎలాంటి నిబంధనలు అమలు పరచాలి అనే దానిపై త్వరలో స్పష్టత ఇస్తాను అని మోడీ తెలిపారు.

మొత్తానికి మరో రెండు మూడు నెలలు దేశంలో లాక్ డౌన్ అనేది అమలు అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube