లాక్ డౌన్ విషయం లో మోదీ కీలక నిర్ణయం ?

కరోనా వైరస్ ప్రభావంతో దేశమంతా అల్లకల్లోల పరిస్థితి ఏర్పడింది.ఈ వైరస్ మహమ్మారి ప్రభావం రోజురోజుకు పెరిగిపోతు దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది.

 Indian Prime Minister Take Another Critical Decission About Lock Down Issue, Ind-TeluguStop.com

ఇప్పటి వరకు ఈ వైరస్ ను నిర్మూలించే వ్యాక్సిన్ ఏది అందుబాటులోకి రాకపోవడం ఆందోళన కలిగిస్తున్న విషయం.ఈ పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ను సమర్థవంతంగా అమలు చేస్తూ, మోది కీలక నిర్ణయం తీసుకున్నారు.

అయినా దేశవ్యాప్తంగా ఇంకా పరిస్థితి అదుపులోకి రాలేదు.ఒక వైపు లాక్ డౌన్ కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నం అయింది.

లాక్ డౌన్ ఈనెల 14వ తేదీ వరకు అమలు అవుతుండడంతో ఆ తరువాత యధావిధిగా కార్యకలాపాలు నిర్వహించే అవకాశం ఉందని భావిస్తున్నారు.అయితే ప్రస్తుతం ఆ సంఖ్య నాలుగు వేలు దాటింది.

రోజు రోజుకు అనేక రాష్ట్రాల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి.ఇప్పటికే ఈ వైరస్ కారణంగా 118 మంది మృతి చెందారు.

మహారాష్ట్రలో అత్యధికంగా 700 కేసులు , తమిళనాడులో 512 కేసులు, ఉత్తరప్రదేశ్ లో 371 కేసులు నమోదయ్యాయి.

Telugu Corona, Indianfinancial, Maharastra, Narendra Modi, Tamilanadu, Telangana

ఈ నేపథ్యంలో లాక్ డౌన్ డౌన్ నిబంధనలు మరికొంత కాలం పొడిగించాలంటూ చాలా రాష్ట్రాలతో పాటు, ఆరోగ్య శాఖ అధికారులు కూడా సూచనలు చేస్తున్నారు.ఇప్పటికే బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ కూడా మరో కొంతకాలం పాటు లాక్ డౌన్ అమలు చేస్తేనే బెటర్ అంటూ రిపోర్టు అందించింది.దీంతో కొంత కాలం ఈ నిబంధనను పొడిగిస్తారా అనే సందేహం ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది.

అయితే అలా చేయడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమై, పరిస్థితులు మరింత దిగజారి పోతాయనే ఉద్దేశంతో ఉన్న మోదీ లాక్ డౌన్ ను మరికొంత కాలం పొడిగించే కంటే, కొన్ని కఠిన నిబంధనలు అమలు చేయడం ద్వారా ఈ వైరస్ వ్యాప్తిని అడ్డుకోవాలని, అదే సమయంలో ప్రజలు ఇబ్బంది పడకుండా చూడాలని ప్రధాని నరేంద్రమోదీ ఆలోచన చేస్తున్నారట.దీనిలో భాగంగా కరోనా వైరస్ బారిన పడి చికిత్స పొందుతున్న వారికి రెండు దఫాలుగా పరీక్షలు చేయాలని, రెండుసార్లు వారికి వస్తే వారిని డిశ్చార్జి చేయాలని ఆదేశాలు ఎప్పటికే ఇచ్చారు.

అదేవిధంగా బఫర్ జోన్ లపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి అక్కడ నిబంధనలు కఠినంగా అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది .ఒకవేళ లాక్ డౌన్ నిబంధనలు ఎత్తివేసిన, ప్రజలు ఎవరు రోడ్లపైకి గుంపులుగుంపులుగా సంచరించకుండా కఠిన నిబంధనలు విధించాలని, సినిమాహాళ్లు ఫంక్షన్ హాలు ఎలా రద్దీ ఉండే అవకాశం ఉన్న అన్నిటినీ మరికొంత కాలం మూసివేయాలని, ప్రజల్లో ఈ వైరస్ పై మరింత అవగాహన పెంచాలని ఇప్పటికే ప్రధాన కార్యాలయం నుంచి అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు వెళ్లినట్లు సమాచారం.అలాగే ప్రధాని మోదీ, ఆయన కేబినెట్ సభ్యులు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అధికారులతో సమీక్ష సమావేశాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించి, లాక్ డౌన్ విషయంలోనూ, కరోనా ను కట్టడి చేసే విషయంలోనూ కీలక నిర్ణయం ఈరోజు తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube