లాక్ డౌన్ ఎత్తివేస్తున్నట్లు ప్రకటించిన రాష్ట్రం

కరోనా వైరస్ భారతదేశంలో కూడా తీవ్ర ప్రభావం చూపుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.21 రోజుల పాటు ఈ లాక్ డౌన్ ను పాటించాలి అంటూ కేంద్ర ప్రభుత్వం సూచించడం తో దేశవ్యాప్తంగా ఈనెల 14 వరకు అన్ని రాష్ట్రాల్లో ఈ లాక్ డౌన్ అనేది అమలు లో ఉంది.అయితే ఢిల్లీ మర్కజ్ ప్రార్ధనల నేపథ్యంలో ఈ కరోనా వైరస్ కేసులు మరింత పెరిగిపోవడం తో ఈ లాక్ డౌన్ ను మరింత పొడిగించే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.దానికి తోడు తెలంగాణా సీఎం కేసీఆర్ కూడా ఈ లాక్ డౌన్ ను మరో నెల రోజులపాటు పొడిగించాలని కోరుతూ ప్రధానికి విజ్ఞప్తి చేసినట్లు కూడా తెలుస్తుంది.

 Meghalaya Government Decided To Open Government Offices In April 15 Th , India L-TeluguStop.com

అయితే ఈశాన్య రాష్ట్రం అయిన మేఘాలయ మాత్రం లాక్ డౌన్ విషయం లో తన నిర్ణయాన్ని ప్రకటించింది.కేంద్ర ప్రభుత్వం ఆదేశించినట్లు ఏప్రిల్ 14 వరకే లాక్ డౌన్ ను పాటిస్తామని,ఏప్రిల్ 15 నుంచి లాక్ డౌన్ నిబంధనలను సడలించనున్నట్లు ప్రకటించింది.

ఆ రోజు నుంచి అన్ని కార్యాలయాలు యథాతథంగా పని చేస్తాయని అయితే ప్రైవేట్ వ్యాపారాలపై మాత్రం నిషేధం ఉంటుందని స్పష్టం చేసింది.ఈ నెల 15వ తేదీ నుంచి సాధారణ పరిస్థితులు ఏర్పడేందుకు కావాల్సిన అన్ని చర్యలు తీసుకుంటున్నామని ప్రకటించింది.

ఈ నెల 15వ తేదీ నుంచి పాఠశాలలు, విద్యాసంస్థలు మినహా అన్ని రకాల సేవలు అందుబాటులోకి తీసుకుని వస్తామని మేఘాలయ ప్రభుత్వం తెలిపింది.రోడ్లపై అన్ని వాహనాలను అనుమతిస్తామని, వ్యవసాయ కార్యకలాపాలు కూడా ఎప్పటిలాగే కొనసాగుతాయని తెలిపింది.

దేశంలో తీవ్రంగా ప్రబలుతున్న ఈ కరోనా మహమ్మారి మేఘాలయలో మాత్రం ఇప్పటివరకు ఒక్కకేసు కూడా నమోదు కాకపోవడం తో లాక్ డౌన్ ఆంక్షలను సడలించేందుకు ఆ రాష్ట్రం సిద్ధమవుతోంది.అయితే వైద్య అధికారుల సూచనలను గ్రామీణ ప్రాంత ప్రజలు కచ్చితంగా పాటించాలని హెచ్చరించింది.

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా జనజీవనానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ప్రకటన చేసింది.లాక్‌డౌన్ మరింత కాలం కొనసాగితే వచ్చే ఇబ్బందుల నేపథ్యంలో తాము దీనిని పొడిగించాలనుకోవడం లేదని మేఘాల‌య ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.

మరి ప్రధాని మోడీ గారు చెప్పినట్లు దశలవారీగా లాక్ డౌన్ ను ఎత్తివేస్తారా లేదంటే తీవ్రత ను బట్టి మరికొన్ని రోజులు ఈ లాక్ డౌన్ ను పొడిగిస్తారా అన్న విషయం తెలియాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube