కరోనా లెక్కలు దాయాల్సిన అవసరం ఏంటీ?

ఏపీ ప్రభుత్వం కరోనా పాజిటివ్‌ల సంఖ్యలను దాస్తుందనే అనుమానాలు కలుగుతున్నాయంటూ తెలుగు దేశం పార్టీ అధినేత ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అనుమాలు వ్యక్తం చేసిన విషయం తెల్సిందే.ఇలాంటి విషయాలు దాచడం వల్ల మరింత ప్రమాదం ఉంటుందని వెంటనే ప్రతి అప్‌డేట్‌ను ప్రజలకు ఇంకా కేంద్రంకు తెలియజేయాల్సిందిగా చంద్రబాబు సూచించాడు.

 Perni Nani Give The Clairty About Corona Positive Cases Count, India Lock Down,-TeluguStop.com

ఈ విషయమై ఇప్పటికే ఏపీ ప్రభుత్వం స్పందిస్తూ కరోనా లెక్కలు దాచడం లేదంటూ ప్రకటన చేసిన విషయం తెల్సిందే.

తాజాగా మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడిన సందర్బంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్యను దాస్తున్నట్లుగా వస్తున్న విమర్శలను ఆయన కొట్టి పారేశాడు.

ఇలాంటి సమయంలో రాజకీయం చేసేలా మాట్లాడటం సరికాదు.ప్రతి ఒక్కరిని కూడా గుర్తించి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది.వాలింటీర్ల ద్వారా ఇప్పటికే విదేశాల నుండి వచ్చిన 28622 మందిని గుర్తించాం.అందులో 15 మందికి పాజిటివ్‌ అని తేలింది.

వారి కుటుంబ సభ్యులను పూర్తిగా క్వారెంటైన్‌కే పరిమితం చేశాం.వారి క్వారెంటైన్‌ టైం గడువు ముగియబోతుంది.

ఇక మర్కజ్‌ మత సమావేశాలకు వెళ్లి వచ్చిన వారిని గుర్తించాం.వారిలో 196 మందికి పాజిటివ్‌ గా గుర్తించాం.

మిగిలిన వారందరిని కూడా క్వారెంటైన్‌లో ఉంచాం.ఇందులో ఒక్క విషయాన్ని దాచాల్సిన అవసరం లేదంటూ మంత్రి పేర్కొన్నాడు.

అనవసరంగా ప్రతిపక్షం విమర్శలు మానాలంటూ ఆయన విజ్ఞప్తి చేశాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube