భోపాల్ లో కరోనా కలకలం,ఏకంగా 10 మంది పోలీసులకు

మధ్యప్రదేశ్ భోపాల్ సిటీ పోలీసులకు కరోనా వైరస్ సోకింది.ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.

 Madhya Pradesh Police Infected From Coronavirus, India Lock Down, Corona Virus,-TeluguStop.com

తబ్లిగ్ జమాత్ సభ్యులను అరెస్ట్ చేసిన నేపథ్యంలో భోపాల్ సిటీ ఎస్పీ,ఓ ఎస్సై తో పాటు మరో 8 మంది కానిస్టేబుళ్లు ఈ వైరస్ బారిన పడినట్లు తెలుస్తుంది.దీనితో పోలీసులను ఐసోలేషన్ కు తరలించినట్లు తెలుస్తుంది.

అంతేకాకుండా వారితో సన్నిహితంగా మెలిగిన వారిని కూడా క్వారంటైన్ కు పంపించినట్లు అధికారులు తెలిపారు.ఆ 10 మంది కూడా ఐష్ బాగ్,జహాంగీరా బాద్ పోలీస్ స్టేషన్ లకు చెందినవారే కావడం తో అప్రమత్తమైన అధికారులు వెంటనే ఆ పోలీస్ స్టేషన్ లను శానిటైజ్ చేసినట్లు తెలుస్తుంది.

భోపాల్ నగరంలో ఇటీవల ఢిల్లీలోని మర్కజ్ మసీదులో ప్రార్థనలకు వెళ్లి వచ్చిన 32 మంది తబ్లిగ్ కార్యకర్తలను గుర్తించారు.ఈ క్రమంలోనే వారిని అరెస్టు చేసి ఐసోలేషన్‌కు తరలించగా, పోలీసులకు కూడా కరోనా సోకినట్లు తెలుస్తుంది.

అందుకే అన్ని పోలీసుస్టేషన్లను శానిటైజ్ చేశామని, వెయ్యిమంది పోలీసులను హోటళ్లకు తరలించామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.జమాత్‌కు వెళ్లిన వారి కోసం గాలిస్తుండగా.

వారి నుంచి ఈ వైరస్ సోకిందని పరీక్షల్లో తేలింది.

ప్రస్తుతం పరిస్థితిని సమీక్షిస్తున్నామని భోపాల్ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు.

మరోవైపు ఇప్పటికే మర్కజ్ కు వెళ్లి వచ్చిన వారు అందరూ కూడా స్వచ్ఛందంగా బయటకు రాకపోతే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ప్రభుత్వం హెచ్చరించినట్లు తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube