కప్ గెలిచిన ఇండియా లెజెండ్స్..!

వయసు పైబడినా కూడా దిగ్గజ భారత క్రికెటర్లు ఆదివారం రోజు జరిగిన రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ టీ20 క్రికెట్ టోర్నీలో తమ సత్తా చాటి అందర్నీ ఆశ్చర్యపరిచారు.రిటైరైన క్రికెటర్లతో నిర్వహించిన ఈ రోడ్ సేఫ్టీ సిరీస్ లో శ్రీలంక లెజెండ్స్ పై భారత క్రికెట్ జట్టు 14 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

 India Legends Win The Cup Raod Safety, Series, Winned Match, Legends, Viral News-TeluguStop.com

తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 181 పరుగులు చేసి సంచలనం సృష్టించింది.యూసఫ్ పఠాన్ 36 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లు సాయంతో 62 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచారు.

యువరాజ్ సింగ్ కూడా విధ్వంసకరమైన బ్యాటింగ్ తో 41 బంతుల్లో 60 పరుగులు సాధించారు.మాస్టర్ బ్లాస్టర్ సచిన్ 23 బంతుల్లో 5 ఫోర్లు కొట్టి 30 పరుగు చేసి వావ్ అనిపించారు.

Telugu @sachin_rt, Legends, Raod Safety, Ups-Latest News - Telugu

అయితే 182 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక సీనియర్ ఆటగాళ్లు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 167 పరుగులు సాధించి ఓటమి పాలయ్యారు.జయసూర్య 43 పరుగులు చేయగా, కెప్టెన్ దిల్షాన్ 21 పరుగులు చేయగలిగారు.వీళ్లిద్దరు అవుటైన తర్వాత శ్రీలంక జట్టు ఓటమి వైపు పరిగెత్తింది.చివరి ఓవర్లలో చెలరేగిన జయసింఘే ఒక ఫోర్, రెండు సిక్సర్లతో 30 బంతుల్లో 40 రన్స్ చేశారు.

వీరరత్నే కూడా 15 బంతుల్లో 3

హాఫ్ సెంచరీ చేసిన యూసఫ్ పఠాన్ బౌలింగ్ లో కూడా రాణించారు.నాలుగు ఓవర్లు బోల్ చేసి 26 పరుగులు ఇచ్చిన యూసఫ్ పఠాన్ రెండు వికెట్లను తీశారు.

ఈ మ్యాచ్ లో యువరాజ్ సింగ్, సచిన్ టెండూల్కర్ తదితరులు అద్భుతమైన క్రీడా ప్రతిభను చాటి అందర్నీ ఆశ్చర్యపరిచారు.ఐతే చత్తీస్‌గఢ్‌ సీఎం భూపేశ్‌ బాఘేల్‌ చేతుల మీదుగా సచిన్‌ రోడ్ సేఫ్టీ టోర్నమెంట్ కప్‌ ను అందుకున్నారు.

ఐతే భారత క్రికెటర్లు రోడ్ సేఫ్టీ టోర్నమెంట్ కప్ అందుకుంటున్న దృశ్యాలు, వీడియోలు నెట్లో హల్చల్ చేస్తున్నాయి.ఇండియన్ క్రికెట్ లెజెండ్స్ విజయం సాధించడంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

వాహ్వా అని యూసఫ్ పఠాన్, యువరాజ్ సింగ్ లను బాగా పొగుడుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube