మీరు మాకంటే వెనుకబడి ఉన్నారు

ఇండియా పొరుగున ఉన్న చైనాతో అన్ని రంగాల్లో పోటీ పడుతున్నదని అందరూ అంటూ ఉంటారు.ప్రధానంగా అమెరికన్ మీడియా చైనాతో భారత్ పోటీ పడుతోందని, ఆసియాలో ఈ రెండు దేశాలు బలమైన ఆర్ధిక వ్యవస్థలని చెబుతూ ఉంటుంది.

 India Lags Behind China In Many Fields-TeluguStop.com

అయితే భారత్ను చైనా తీసి పారేసింది.అభివృద్ధి విషయంలో, ఆర్ధిక వ్యవస్థలో ఇండియాకు, తమకు పోలిక లేదని చైనాలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న ఒక పత్రిక తెగేసి చెప్పింది.

అన్ని రంగాల్లోనూ భారత్ తమ దేశం కంటే వెనుకబడి ఉందని తెలిపింది.గత 5 సంవత్సరాల్లో చైనా దరిదాపులకు రాలేదని స్పష్టం చేసింది.

వస్తు తయారీ రంగంలో, రవాణా రంగంలో, మౌలిక వసతుల రంగంలో ఐదేళ్ళు వెనుకబడి ఉందని తెలిపింది.అయితే అమెరికా నుంచి వెలువడే న్యూయర్క్ టైమ్స్ కథనం ఇందుకు భిన్నంగా ఉంది.

భారత్ సమీప భవిషత్తులో చైనా స్థానం ఆక్రమిస్తుందని తెలిపింది.అమెరికాకు ఇండియాతో ఎక్కువ సంబంధాలు ఉన్నాయి కాబట్టి అలా చెప్పి ఉండొచ్చు.

కానీ అభివృద్ధి విషయంలో చైనాయే ముందు ఉంది.చైనాను సందర్శించే భారతీయులు అక్కడి అభివృద్ధికి ఆశ్చర్య పోతుంటారు.

ఇండియాలో ఒక బడికి భవనం కట్టడానికి మూడు నాలుగేళ్ళు పడుతుంది.కానీ చైనాలో ఎంత పెద్ద భారీ నిర్మాణం అయినా చాలా తొందరగా పూర్తి చేస్తారు.

చైనా పాలకులకు ఉన్నంత అంకిత భావం, చిత్తశిద్ధి భారతీయులకు లేవనే విషయం అందరికీ తెలిసిందే.ఇండియాలో మౌలిక వసతులు చాలా తక్కువ.

ఇప్పటికీ సగం దేశంలో మరుగుదొడ్లు లేవంటే అభివృద్ధి ఎంత వుందో అర్ధం చేసుకోవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube