కామ‌న్వెల్త్ క్రీడ‌ల్లో భార‌త్ జోరు

బ్రిట‌న్ లోని బ‌ర్మింగ్ హామ్ వేదిక‌గా జ‌రుగుతున్న కామ‌న్వెల్త్ క్రీడ‌ల్లో భార‌త్ వేట కొన‌సాగుతోంది.బాక్సింగ్ లో మ‌రో రెండు ప‌సిడి ప‌త‌కాలతో పాటు ట్రిపుల్ జంప్ లోనూ స్వ‌ర్ణ ప‌త‌కాన్ని చేజిక్కుంచుకుంది.

 India Is Strong In The Commonwealth Games-TeluguStop.com

మహిళల బాక్సింగ్ 48 కిలోల విభాగంలో నీతూ ఘంఘాస్ ఇంగ్లండ్ కు చెందిన డెమీ జేడ్ రెస్జాన్ ను 5-0తో పోటీ ప‌డింది.పురుషుల బాక్సింగ్ 51 కిలోల విభాగంలో అమిత్ పంఘాస్ ఇంగ్లండ్ బాక్సర్ కైరన్ మెక్ డొనాల్డ్ పై 5-0తో విజయభేరి మోగించాడు.

ట్రిపుల్ జంప్ లో ఎల్డోస్ పాల్ అద్భుత ప్రతిభ కనబర్చి స్వర్ణం అందుకున్నాడు.

మ‌రోవైపు, అథ్లెటిక్స్ లో భారత ట్రిపుల్ జంపర్ ఎల్డోస్ పాల్ స్వ‌ర్ణం సాధించ‌గా, భారత్ కు చెందిన అబూబకర్ కు ఇదే క్రీడలో రజతం దక్కింది.ఎల్డోస్ పాల్ తన అత్యుత్తమ ప్రదర్శన 17.03 మీటర్లు నమోదు చేసి రెండోస్థానంలో నిలిచాడు.దీంతో అథ్లెటిక్స్ లో మరో రెండు కాంస్యాలు కూడా భారత్ ఖాతాలో చేరాయి.మహిళల జావెలిన్ త్రోలో అన్ను రాణి, పురుషుల 10 వేల మీటర్ల నడకలో సందీప్ కుమార్ కాంస్యం నెగ్గారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube