ప్రపంచంలో అత్యధిక కాలుష్య నగరాల్లో ఇండియా టాప్!

ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ వార్మింగ్ ప్రభావం ఏస్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.కాలుష్యం కారణంగా ఈ గ్లోబల్ వార్మింగ్ ఎక్కువై వాతావరణంలో కూడా అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి.

 India Have 15 Pollution Cities In Thworld-TeluguStop.com

తాజాగా ప్రపంచంలో అత్యధిక కాలుష్యం ఉన్న నగరాల జాబితాను గ్రీన్పీస్ అనే ఎన్జీవో ప్రకటించింది.ఇందులో మొత్తం ప్రపంచంలో టాప్ 20 కాలుష్య నగరాలను గ్రీన్ పీస్ సంస్థ గుర్తించడం విశేషం.

టాప్ 20 కాలుష్య నగరాలలో మొత్తం 15 నగరాలు ఇండియాలో ఉండడం గమనార్హం.వీటిలో టాప్ ప్లేస్ లో హర్యానా లో ఉన్న గుర్గావ్, ఘజియాబాద్ తొలి రెండు స్థానాల్లో ఉండగా, ఢిల్లీ 11వ స్థానంలో నిలిచింది.

ఇక ఇండియాలో అత్యంత కాలుష్యభరిత నగరాల జాబితాలో ఉన్న 15 ఉత్తర భారతదేశంలో ఉండడం గమనార్హం.ఇక ఈ రిపోర్ట్ ప్రకారం ప్రపంచంలో గ్లోబల్ వార్మింగ్ కి ఎక్కువగా భారత్ కారణమవుతుందని తెలుస్తోంది.

అయితే కాలుష్యాన్ని తగ్గించే క్రమంలో భారత ప్రభుత్వం ఎలాంటి నియంత్రణ చర్యలు తీసుకోవడం లేదని కూడా సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube