ప్రపంచంలో అత్యధిక కాలుష్య నగరాల్లో ఇండియా టాప్!  

ప్రపంచంలో అత్యధిక పొల్యూషన్ ఉన్న నగరాల జాబితాలో ఇండియా మొదటి స్థానంలో ఉంది..

India Have 15 Pollution Cities In The World-delhi,global Warming,india,north India,world

ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ వార్మింగ్ ప్రభావం ఏస్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాలుష్యం కారణంగా ఈ గ్లోబల్ వార్మింగ్ ఎక్కువై వాతావరణంలో కూడా అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ప్రపంచంలో అత్యధిక కాలుష్యం ఉన్న నగరాల జాబితాను గ్రీన్పీస్ అనే ఎన్జీవో ప్రకటించింది..

ప్రపంచంలో అత్యధిక కాలుష్య నగరాల్లో ఇండియా టాప్!-India Have 15 Pollution Cities In The World

ఇందులో మొత్తం ప్రపంచంలో టాప్ 20 కాలుష్య నగరాలను గ్రీన్ పీస్ సంస్థ గుర్తించడం విశేషం.

టాప్ 20 కాలుష్య నగరాలలో మొత్తం 15 నగరాలు ఇండియాలో ఉండడం గమనార్హం. వీటిలో టాప్ ప్లేస్ లో హర్యానా లో ఉన్న గుర్గావ్, ఘజియాబాద్ తొలి రెండు స్థానాల్లో ఉండగా, ఢిల్లీ 11వ స్థానంలో నిలిచింది. ఇక ఇండియాలో అత్యంత కాలుష్యభరిత నగరాల జాబితాలో ఉన్న 15 ఉత్తర భారతదేశంలో ఉండడం గమనార్హం. ఇక ఈ రిపోర్ట్ ప్రకారం ప్రపంచంలో గ్లోబల్ వార్మింగ్ కి ఎక్కువగా భారత్ కారణమవుతుందని తెలుస్తోంది. అయితే కాలుష్యాన్ని తగ్గించే క్రమంలో భారత ప్రభుత్వం ఎలాంటి నియంత్రణ చర్యలు తీసుకోవడం లేదని కూడా సమాచారం.