ప్రపంచ కప్ లో ఏ దేశం సాధించని రికార్డ్ భారత్ కి సొంతం.. ఆ రికార్డ్ ఏంటో తెలుసా ?  

India Record Of Achievement In The World Cup-2007 In South Africa,2007 World Cup,2011 India,india,india Has No Record Of Achievement In The World Cup,kapil Dev,sport Updates,ప్రపంచ కప్

ప్రపంచ కప్ లో ఇప్పటి వరకు ఎన్నో రికార్డ్ లు నమోదయ్యాయి. మళ్ళీ ఆ రికార్డ్ లను ఎవరో ఒకరు తిరగరాస్తున్నారు. అయితే ప్రపంచ కప్ లో దాదాపు ఈ రికార్డ్ బ్రేక్ చేయడమంటే దాదాపు అసాధ్యమే..

ప్రపంచ కప్ లో ఏ దేశం సాధించని రికార్డ్ భారత్ కి సొంతం.. ఆ రికార్డ్ ఏంటో తెలుసా ?-India Record Of Achievement In The World Cup

ఆ రికార్డ్ ఏంటో మీకు తెలుసా ?

ప్రపంచ కప్ క్రికెట్ అనగానే 50 ఓవర్ల మ్యాచ్ లే గుర్తుకువస్తాయి. 2007 లో టీ20 ప్రపంచ కప్ ని కూడా ప్రారంభించారు. అయితే భారత జట్టు ఇప్పటి వరకు టీ20 ప్రపంచ కప్ తో కలిపి 3 సార్లు విశ్వ విజేతగా నిలిచింది. అందులో 60 ఓవర్ల ప్రపంచ కప్ , 50 ఓవర్ల ప్రపంచ కప్ , 20 ఓవర్ల ప్రపంచ కప్ లు ఉన్నాయి. ఇలా 60-50-20 ఓవర్లు గెలుచుకున్న మొదటి జట్టు భారత్ కావడం విశేషం. ఈ రికార్డ్ బ్రేక్ చేయడం ప్రస్తుతం ఏ జట్టుకు సాధ్యం కాదు , ఒక వెస్టిండీస్ కి తప్ప. వెస్టిండీస్ ఇప్పటి వరకు 60 ఓవర్ల ప్రపంచ కప్ , టీ20 ప్రపంచ కప్ లు గెలుచుకుంది. ఇప్పట్లో ఆ జట్టు 50 ఓవర్ల ప్రపంచ కప్ గెలవడం అసాధ్యం. ఒకవేళ ఆ జట్టు 50 ఓవర్ల ప్రపంచ కప్ గెలిస్తే భారత రికార్డ్ ని సమం చేసే అవకాశం ఉంది..

1983 – 60 ఓవర్ల ప్రపంచ కప్1983 లో ఇంగ్లాండ్ లో జరిగిన 60 ఓవర్ల ప్రపంచ కప్ లో కపిల్ దేవ్ నాయకత్వం లో భారత జట్టు వెస్టిండీస్ జట్టు పై 43 పరుగులతో గెలిచి ప్రపంచ ఛాంపియన్ లు గా నిలిచారు.

2007 – టీ20 ప్రపంచ కప్2007 లో సౌతాఫ్రికా లో జరిగిన టీ20 ప్రపంచ కప్ లో మహేంద్రసింగ్ ధోని నాయకత్వం లో పాకిస్తాన్ జట్టు పైన 5 పరుగుల తేడాతో గెలిచి పొట్టి ప్రపంచ కప్ లో విశ్వవిజేతలుగా నిలిచారు.

2011 – 50 ఓవర్ల ప్రపంచ కప్2011 లో భారత ఉపఖండం లో జరిగిన ప్రపంచ కప్ లో ధోని నాయకత్వం లో శ్రీలంక జట్టు పై 6 వికెట్ల తేడాతో గెలిచి 50 ఓవర్ల ప్రపంచ కప్ లో ఛాంపియన్ లుగా నిలిచారు.

ఈ రికార్డ్ ని అందుకోవడం ప్రస్తుతం వెస్టిండీస్ జట్టు కి తప్ప ఏ జట్టు కి కూడా అవకాశాలు లేవు. ప్రపంచ కప్ లో ఏదైనా అద్భుతం జరిగితే వెస్టిండీస్ జట్టు కూడా 50 ఓవర్ల ప్రపంచ కప్ గెలిచే అవకాశాలు ఉన్నాయి..