ఈ విషయంలో చైనాను దెబ్బ తీసిన భారత్.. ?

కరోనాకు పుట్టిల్లుగా పేరుగాంచిన చైనా ఈ మాయదారి రోగానికి కూడా మందు కనుగొన్న విషయం తెలిసిందే.అయితే కోవిడ్ 19 వచ్చిందన్న విషయాన్ని దాచిన చైనా ఈ వ్యాధి తీవ్ర రూపం దాల్చడానికి కూడా పరోక్షంగా కారణం అయ్యింది.

 China, India, Corona Virus, Covishield, Vaccine-TeluguStop.com

దీని పై తీవ్రమైన విమర్శలు కూడా వెల్లువెత్తాయి.

ఇకపోతే ఈ మాయదారి రోగానికి మన భారతదేశం వ్యాక్సిన్ కనుగొన్న ముచ్చట తెలిసిందే.

చైనా కూడా సినోవ్యాక్‌ వ్యాక్సిన్‌ అభివృద్ధి చేసింది.అయితే చైనా దేశాన్ని ఇప్పుడు ప్రపంచం నమ్మడం లేదు.

ఇక ఆ డ్రాగన్ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ ఎలా నమ్ముతారు.అందుకే ప్రపంచ దేశాల చూపు ప్రస్తుతం భారత్ తయారు చేసిన కోవిషీల్డ్‌ వ్యాక్సిన్ వైపు మళ్లిందట.

అందుకే కరోనా వ్యాక్సిన్ల కోసం ఇతర దేశాలు భారత్‌ను అభ్యర్ధిస్తున్నాయట.

ఇప్పటికే ఏడు పొరుగు దేశాలకు యాభై లక్షల కోవిషీల్డ్‌ డోసులను భారత్‌ తరలించిన అనంతరం తమకూ వ్యాక్సిన్‌ డోసులను ఉదారంగా సరఫరా చేయాలని, వాణిజ్య సరఫరాలకూ సిద్ధమని పలు దేశాలు భారత్‌ను కోరుతున్నాయి.

ఒకరకంగా మన వ్యాక్సిన్ ఇతర దేశాలతో వాణిజ్య సంధాలను మెరుగుపరచుకోవడానికి దారి చూపుతుందని తెలుస్తుంది.అంటే ఈ విషయంలో చైనాను భారత్ దెబ్బ తీసిందని చెప్పవచ్చూ.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube