క్రికెట్‌కు మన దేశంలో ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా దీనికి ఫ్యాన్ అయి ఉంటారు.
ఇకపోతే ఇప్పుడు ఇండియా ఇంగ్లండ్ మీద టెస్టు మ్యాచ్‌లో సంచలన విజయం సాధించడంతో ప్రతి ఒక్కరు కూడా దీన్ని గ్రాండ్ గానే సెలబ్రేట్ చేసుకుంటున్నారు.ఇక అభిమానులతో పాటు మాజీ స్టార్ క్రికెటర్లు కూడా బాగానే సంబురాలు చేసుకుంటున్నారు.
ఎందుకంటే ఈ విజయం దాదాపుగా 50 ఏళ్ల నిరీక్షణ తర్వాత సాధించింది కావడంతో ఇండియా క్రికెట్ అభిమనుల ఆనందానికి అవధుల్లేకుండా ఉన్నాయి.
ఇక మ్యాచ్ గెలిచిన తర్వాత టీమిండియా క్రికెటర్లు తమ డ్యాన్స్‌లు అలాగే కేకలు, ఈలలతో డ్రెసింగ్ రూమ్ లో నానా హంగా చేశారు.
ఇక భారతీయ అభిమానులు కూడా ప్రపంచ వ్యాప్తంగా సంబురాలు చేసుకున్నారు.అయితే ఇలా సంబురాలు చేసుకున్న వారిలో ఎక్కువగా వైరల్ అయింది మాత్రం భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్.
ఎందుకంటే ఆయన సెలబ్రేషన్స్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి.ఇక ఎప్పటిలాగే రొటీన్‌కు భిన్నంగా ఆయన తనదైన స్టైల్లో సెలబ్రేషన్స్ చేసుకున్నారు.ఇందుకోసం ఆయన ఏకంగా నాగిని డ్యాన్స్ వేశారు.
ఆయన తన స్టార్ డమ్ ను కూడా పక్కన పెట్టేసి టీమిండియా గెలుపును మనస్పూర్తిగా ఆస్వాదిస్తూ నాగిని లాగా డ్యాన్స్ చేశారు.అది కూడా కెమెరాలు చూస్తుండగానే చేశారు.ఇక ఆయన డ్యాన్స్ కు సంబంధించిన వీడియో ఇప్పుడు ట్విటర్లో పోస్ట్ చేయగా విపరీతంగా వైరల్ అవుతోంది.
ఎందుకంటే ఆయన సాధారణంగా చాలా కామ్‌గా కనిపిస్తారు.అలాంటిది ఈ విధంగా నాగిని డ్యాన్స్ తో రెచ్చిపోవడంతో అంతా ఎంజాయ్ చేస్తున్నారు.
మనస్ఫూర్తిగా టీమిండియా విజయాన్ని ఆనందిస్తే ఇలాగే ఉంటుందని చాలామంది కామెట్లు పెడుతున్నారు.మరి మీరు కూడా వీడియో చూసేయండి.