ఆ విషయంలో మెస్సీనే బీట్ చేసిన ఇండియన్ ఫుట్ బాల్ కెప్టెన్ సునీల్ ఛెత్రీ..!

తాజాగా భారత ఫుట్బాల్ టీం కెప్టెన్ అయిన సునీల్ ఛెత్రీ మరో అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు.ఫుట్ బాల్ లో అత్యధికంగా గోల్స్ చేసిన వారిలో అంతర్జాతీయంగా ప్రముఖ ఆటగాడు లియోనెల్ మెస్సీ ను వెనక్కి నెట్టి సునీల్ ఛెత్రీ రెండో స్థానాన్ని చేరుకున్నాడు.2022 ఫిఫా వరల్డ్ కప్ కోసం జరిగే క్వాలిఫయర్స్ లో భాగంగా తాజాగా భారత్ – బంగ్లాదేశ్ ఫుట్ బాల్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో సునీల్ రెండు గోల్స్ సాధించాడు.దీంతో సునీల్ అంతర్జాతీయంగా 74 గోల్స్ చేశాడు.

 Team India Football Captain Sunil Chhetri Beats Leo Messi In International Goals-TeluguStop.com

దీంతో సునీల్ ఛెత్రీ అంతర్జాతీయ ఫుట్ బాల్ గోల్స్ చేసిన వ్యక్తుల లిస్టు లో రెండో స్థానాన్ని ఆక్రమించాడు.

ఇక ఈ లిస్టులో పోర్చుగల్ సూపర్ స్టార్ ఫుట్ బాల్ ప్లేయర్ క్రిస్టియానో రోనాల్డో 103 గోల్స్ తో మొదటి స్థానంలో అందరికంటే ముందుగా ఉన్నాడు.ఇక సునీల్ తర్వాత మూడో స్థానంలో యూఏఈ దేశానికి చెందిన అలీ మబ్ ఖవత్ 73 గోల్స్ చేయడంతో అతడు మూడో స్థానాన్ని సంపాదించాడు.2004లో భారత ఫుట్ బాల్ జట్టుకు అరంగేట్రం చేసినప్పుడు నుండి ప్రతి ఒక కీలక మ్యాచ్ లో ముఖ్యమైన పాత్రను పోషిస్తూ సునీల్ ఈ ఘనతను సాధించాడు.

ఈ రికార్డుతో సునీల్ ఛెత్రీ మరో ప్రత్యేకమైన రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.

Telugu Ali Mab Khamat, Leo Messi, Indian, Goals, India Football, International,

సునీల్ ఛెత్రీ భారతదేశం తరఫున మూడు దశాబ్దాలలో స్కోరు చేసిన తొలి ఆటగాడిగా చరిత్రలో నిలిచిపోయాడు.ఇకపోతే తాజాగా ప్రపంచంలో రెండో స్థానాన్ని దక్కించుకున్నాడన్న విషయాన్ని ఆలిండియా ఫుట్ బాల్ ఫెడరేషన్ అధ్యక్షుడు రాహుల్ పటేల్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.సునీల్ ఛెత్రీమొత్తంగా 117 మ్యాచ్ లలో మొత్తం 74 గోల్స్ చేశాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube