మ్యాటర్‌హార్న్‌ శిఖరంపై మువ్వన్నెల జెండా... గొప్పగా అనిపించింది అన్న బన్నీ

కరోనా వైరస్ ని నియంత్రించే ప్రయత్నంలో ప్రపంచ దేశాలు యుద్ధం చేస్తున్నాయి.కనిపించని శత్రువుతో ప్రతి ఒక్క పౌరుడు సైనికుడుగా మారి ఈ యుద్ధం చేస్తున్నాడు.

 India Flag Displayed On Matterhorn Mountain, Tollywood, Lock Down, Covid-19, Cor-TeluguStop.com

అయిన కూడా ఇప్పటి వరకు ఆ వైరస్ మనుషుల మీద తన ఆధిపత్యం చూపిస్తూ వెళ్తుంది.ప్రపంచ దేశాలలో ఆర్ధిక వ్యవస్థలు మొత్తం కుప్పకూలిపోయే పరిస్థితి ప్రస్తుతం నెలకొని ఉంది.

ఇలాంటి వేళ కరోనా పై పోరాటం చేస్తున్న అన్ని దేశాలు ఆ మహమ్మారిన విజయవంతంగా ఎదుర్కోవాలని కోరుతూ స్విట్జర్లాండ్ సంఘీభావం తెలియజేసింది.దీని కోసం వినూత్న రీతిలో ఆయా దేశాల జాతీయ జెండాలని లేజర్ కాంతులతో ప్రదర్శించి తమ మద్దతు ప్రకటించాయి.

ఈ నేపధ్యంలో స్విట్జర్లాండ్ దేశంలోనే అత్యంత ఎత్తైన పర్వతాల్లో ఒకటైన ఆల్ఫ్స్‌ పర్వత శ్రేణుల్లో మ్యాటర్‌హార్న్‌ శిఖరంపై మన మువ్వన్నెల జెండాను ప్రదర్శించింది.కరోనాపై భారతీయులకు గెలిచే విశ్వాసం, సామర్థ్యం కలగాలని కోరుకుంటూ ట్వీట్ చేసింది.

స్విట్జర్లాండ్‌కు చెందిన విద్యుద్దీపాల కళాకారుడు గెరీ హాఫ్‌సెట్టర్‌ స్విట్జర్లాండ్‌, ఇటలీ దేశాల మధ్య ఉన్న ఈ ఆల్ఫ్స్‌ పర్వత శ్రేణుల్లో దాదాపు 4,478 మీటర్ల ఎత్తున్నశిఖరంపై లేజర్‌ లైట్లతో పలు దేశాల జెండాలను ప్రదర్శించారు.దీనిపైన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స్పందించాడు.

కరోనా పై భారత్ చేస్తున్న పోరాటానికి స్విట్జర్లాండ్‌ సంఘీభావం ప్రకటించడం పట్ల ధన్యవాదాలు తెలిపాడు.తాను ఎప్పుడు మ్యాటర్ హార్న్ పర్వతాలపై జాతీయ జెండాని చూస్తానని అనుకోలేదని, నిజంగా ఇది గుండెకి హత్తుకున్న దృశ్యం అని ట్విట్టర్ లో పోస్ట్ పెట్టాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube