కళ్ళు లేకున్నా కలెక్టర్ అయింది... ప్రజ్ఞల్ పాటిల్ I.A.S సక్సెస్ స్టోరీ ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిందే..  

కళ్ళు లేకున్నా కలెక్టర్ అయింది… ప్రజ్ఞల్ పాటిల్ I.a.s సక్సెస్ స్టోరీ ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిందే..-

మనలో ఏ లోపం లేకున్నా ఏదో లోటు ఉందని కుంగిపోతుంటాం , అలాంటిది కళ్ళు లేకున్నా తన కలలు నెరవేర్చుకొని ఏకంగా కలెక్టర్ అయింది ఒక అమ్మాయి.తను రాసిన మొదటి సారి సివిల్స్ పరిక్షలోనే మంచి ర్యాంక్ ని పొంది ప్రస్తుతం కలెక్టర్ గా పని చేస్తున్న ప్రజ్ఞల్ పాటిల్ ప్రతి ఒక్కరికి ఆదర్శం.

కళ్ళు లేకున్నా కలెక్టర్ అయింది… ప్రజ్ఞల్ పాటిల్ I.a.s సక్సెస్ స్టోరీ ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిందే..--India First Visyvally Challaenged Women IAS Pranjal Patil Succes Story-

ఆమె కన్నీటి కథ వింటే ఎంత బాధలో ఉన్న మనలో స్ఫూర్తి నింపడం ఖాయం.

కళ్ళు లేకున్నా కలెక్టర్ అయింది… ప్రజ్ఞల్ పాటిల్ I.a.s సక్సెస్ స్టోరీ ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిందే..--India First Visyvally Challaenged Women IAS Pranjal Patil Succes Story-

మహారాష్ట్రలోని ఉలహాసనగర్ కి చెందిన ప్రజ్ఞల్ పాటిల్ తనకు ఆరు (6) సంవత్సరాల వయస్సు ఉన్నపుడే ఆమె కంటి చూపుకి సమస్య వచ్చి ఒక కన్ను కోల్పోవాల్సివచ్చింది.అప్పటికి డాక్టర్లు ప్రజ్ఞల్ తండ్రి తో కొంత కాలానికి ఆమె తన రెండో కన్నుకి కూడా కంటి చూపు సమస్య రావచ్చు అని చెప్పారు.

అనుకున్నదే నిజమైంది కొంత కాలానికి ప్రజ్ఞల్ పాటిల్ తన రెండు కన్నులలో చూపు కోల్పోయి పూర్తి అంధకారంలోకి వెళ్ళిపోయింది.అంధత్వం వచ్చిన ప్రజ్ఞల్ మాత్రం తన చదువును వదిలిపెట్టలేదు.మహారాష్ట్రలోనే అంధుల పాఠశాలలో చదువుకుంది.తన డిగ్రీ పూర్తయ్యాక ఢిల్లీ లోని జె.ఎన్.యూ లో మాస్టర్స్ పూర్త చేసింది ప్రజ్ఞల్.

కళ్ళు లేకున్నా కలెక్టర్ అయ్యిందిలా

ప్రజ్ఞల్ పాటిల్ కి తన చిన్ననాటి నుండి దేశానికి ఏదో రూపం లో తన వంతు సాయం చేయాలనే ఆలోచన ఉండేది.తన మాస్టర్స్ పూర్తి చేసాక 26 సంవత్సరాల వయస్సు లో సివిల్స్ కి సన్నద్ధం అవ్వాలనుకుంది.సివిల్స్ కోసం ఎటువంటి కోచింగ్ తీసుకోకుండా తన సొంతంగా పరీక్షకు ప్రిపేర్ అయింది తన మొదటి ప్రయత్నం లొనే జాతీయ స్థాయి లో 773 వ ర్యాంక్ తెచ్చుకుంది , ఆ ర్యాంక్ కి ఆమెకి రైల్వేస్ లో జాబ్ ఇచ్చింది ప్రభుత్వం కానీ అందులో పనిచేయడం ఇష్టం లేని పాటిల్ మరొకసారి ప్రయత్నించగా 2017 లో ఆమెకి దేశ వ్యాప్తంగా సివిల్స్ రాసిన వారిలో 124 వ ర్యాంక్ తెచ్చుకొని కలెక్టర్ పోస్ట్ కి అర్హురాలు అయింది.ప్రస్తుతం తన ట్రైనింగ్ పూర్తి చేసుకొని కేరళలోని ఎర్నాకులం లో అసిస్టెంట్ కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టింది ప్రజ్ఞల్ పాటిల్.మన లక్ష్యం ఎంత పెద్దదైన మనం ప్రయత్నిస్తే మన కష్టం ముందు తలవంచక తప్పదు అనే దానికి ప్రజ్ఞల్ పాటిల్ కథే స్ఫూర్తి….