కరోనా కేసుల్లో మరో మైలు రాయి దాటిన భారత్,ఏకంగా ఆరులక్షలు…  

India crosses 6 lakh corona cases, India, Corona Cases, Coronavirus, lockdown - Telugu Corona Cases, Coronavirus, India, India Crosses 6 Lakh Corona Cases, Lockdown

కరోనా కేసుల్లో భారత్ మరో మైలు రాయిని కూడా దాటేసింది.ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కేసులు నమోదు అయిన దేశాల లిస్ట్ లో భారత్ రెండు,మూడు స్థానాలలో ఉండగా ఇప్పటివరకు దేశవ్యాప్తంగా నమోదు అయిన కేసుల్లో ఆరు లక్షలకు పైగా కేసులు నమోదు అయినట్లు తెలుస్తుంది.

 India Crosses Six Lakhs Corona Cases

లాక్‌డౌన్, క్వారంటైన్, ముందు జాగ్రత్త చర్యలు ఎన్ని తీసుకుంటున్నప్పటికీ ఫలితం మాత్రం ఉండటం లేదు.రోజు రోజుకూ వ్యాధిబారిన పడుతున్నవారు ఎక్కువ అవుతూనే ఉన్నారు.

గడిచిన 24 గంటల్లో నమోదైన వివరాలను కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.ఈ లెక్కన చూస్తే దేశంలో నిన్న ఒక్కరోజే దాదాపు 19,148 మందికి కొత్తగా వ్యాధి నిర్ధారణ అవ్వగా, 434 మంది ప్రాణాలు కోల్పోయారు.దీంతో మొత్తం కేసుల సంఖ్య 6,04,641కు చేరుకుంది.17,834 మహమ్మారి కాటుకు బలి అయ్యారు.
కేసుల సంఖ్య పెరుగుతున్నా రికవరీలు కూడా అదే స్థాయిలో పెరగడం కొంత ఊరట కలిగించే విషయం.ఇప్పటి వరకు వ్యాధి సోకిన వారిలో 3,59,859 మంది బాధితులు కోలుకున్నారు.

కరోనా కేసుల్లో మరో మైలు రాయి దాటిన భారత్,ఏకంగా ఆరులక్షలు…-General-Telugu-Telugu Tollywood Photo Image

ఇంకా 2,26,947 మంది ఆయా రాష్ట్రాల కోవిడ్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 60 శాతంగా ఉందని అధికారులు చెబుతున్నారు.

ప్రధానంగా మహారాష్ట్ర, తమిళనాడు,ఢిల్లీ, గుజరాత్ రాష్ట్రాల్లోనే అత్యధికంగా కరోనా కేసులు నమోదు అవుతున్నట్లు తెలుస్తుంది.మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా కూడా కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తూనే ఉంది.

వైరస్ ఉదృతి రోజు రోజుకు పెరుగుతోంది.ఇప్పటి వరకు మొత్తం 1,08,03,599 మందికి వ్యాధి సోకింది.ఇక మరణాల విషయానికి వస్తే 5,18,968 ప్రాణాలు కోల్పోయారు.64,57,985 మంది కోలుకోగా.43,45,614 యాక్టివ్ కేసులు ఉన్నట్లు తెలుస్తుంది.
ఇక అగ్రరాజ్యం అమెరికాను కూడా ఈ వైరస్ భారీ స్థాయిలో కుదిపేస్తోంది.

అక్కడ నిన్న ఒక్కరోజే ఏకంగా 52,898 మందికి పాజిటివ్‌ నమోదు అవ్వడం గమనార్హం.ప్రపంచ వ్యాప్తంగా పోల్చితే అక్కడే 30 శాతం కేసులు ఉన్నాయి.దీంతో అమెరికాలో 27,79,953 మంది వ్యాధిబారిన పడగా.1,30,798 మంది మరణించినట్లు తెలుస్తుంది.

#Coronavirus #India #Corona Cases #Lockdown

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

India Crosses Six Lakhs Corona Cases Related Telugu News,Photos/Pics,Images..