కరోనా కేసులలో ఇటలీని దాటేసిన భారత్… పెరుగుతున్న వైరస్ ప్రభావం  

India Crosses Italy In Corona Cases - Telugu Corona Effect, Covid-19,, Indian Government, Lock Down

కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి రెండు నెలలు కఠిన లాక్ డౌన్ ని ఇండియాలో అమలు చేసిన కూడా కోవిడ్ బాధితుల సంఖ్య మాత్రం పెరుగుతూ ఉంది.లాక్ డౌన్ సమయంలో కొంత నియంత్రణలో ఉన్నట్లు కనిపించిన కూడా లాక్ డౌన్ సడలింపులు తర్వాత కేసుల సంఖ్య చాలా వేగంగా పెరుగుతున్నాయి.

 India Crosses Italy In Corona Cases

రోజుకి వేల సంఖ్యలో కరోనా బాధితులు అవుతున్నారు.ముఖ్యంగా మహారాష్ట్రలో అయితే చాలా వేగంగా కరోనా కేసులు విస్తరిస్తున్నాయి.

ఇక ఆరంభంలో కరోనాతో అల్లాడిపోయిన ఇటలీలో కరోనా కేసుల సంఖ్య నియంత్రణలో ఉండగా ఇండియా మాత్రం ఇటలీని దాటేసింది.ఓ విధంగా ఇది దారుణమైన పరిస్థితి.

కరోనా కేసులలో ఇటలీని దాటేసిన భారత్… పెరుగుతున్న వైరస్ ప్రభావం-General-Telugu-Telugu Tollywood Photo Image

దేశంలో కరోనా కేసుల తాజా గణాంకాలను ఈ రోజు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసింది.ఈ గణాంకాల ప్రకారం గత 24 గంటల్లో దేశంలో 9,887 మందికి కొత్తగా కరోనా సోకింది.

దేశంలో ఒక్కరోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే.అదే సమయంలో 294 మంది మరణించారు.ఇప్పటివరకు మొత్తం 2,36,657కి చేరగా, మృతుల సంఖ్య 6,642 కి చేరుకుంది.ఇక ఇటలీలో కరోనా కేసులు మనకంటే రెండు వేలు తక్కువగానే ఉన్నాయి.కరోనా కేసులో దేశంలో చాలా వేగంగా విస్తరిస్తున్న దీనిని కట్టడి చేయడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నట్లు కనిపించడం లేదు.కేసులు ఎక్కువైనా కూడా లాక్ డౌన్ సడలింపులు కల్పిస్తున్నారు.

రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలని యధావిధిగా వదిలేసాయి.ప్రజలు కూడా కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న మొదట్లో ఉన్న భయం ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు.

మరి ఇలాగే కేసుల సంఖ్య పెరిగిపోతూ ఉంటే రానున్న రోజుల్లో చాలా గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

footer-test