ఇండియాలో కరోనా వైరస్ లేటెస్ట్ లెక్కలు..!!

ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల కంటే అగ్రదేశాల కంటే మహమ్మారిని గట్టిగా ఎదుర్కొన్న దేశం భారత్ అని చెప్పవచ్చు.ఈ విషయాన్ని చాలా మంది అంతర్జాతీయ స్థాయిలో ఉన్న ప్రముఖులు చాలాసార్లు స్పష్టం చేయడం జరిగింది.

 India Corona Virus Latest Figures-TeluguStop.com

ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం పైగా రెండో అతిపెద్ద జనాభా కలిగిన దేశం అయినా గాని కరోనా వైరస్ ని కంట్రోల్ చేయడంలో మాత్రం .ఇతర దేశాలకు భిన్నంగా భారత్ రాణించింది అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధులు కూడా చెప్పుకు రావడం జరిగింది.ఇదిలా ఉంటే చాలా దేశాలలో కరోనా వ్యాక్సిన్.అందుబాటులోకి వచ్చిన గాని ఎక్కువగా మాత్రం ఇండియా వ్యాక్సిన్ అద్భుతమైన సత్ఫలితాలు ఇవ్వటంతో… ప్రపంచ దేశాలు మన వాక్సిన్ కోసం  ఆర్డర్ లు పెడుతున్న సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే తాజాగా కేంద్ర ఆరోగ్య వైద్య శాఖ.ప్రస్తుతం దేశంలో ఉన్న కరోనా పరిస్థితి ఏంటో అన్న దాని విషయంలో హెల్త్ బులిటెన్ విడుదల చేయడం జరిగింది.

 India Corona Virus Latest Figures-ఇండియాలో కరోనా వైరస్ లేటెస్ట్ లెక్కలు..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

హెల్త్ బులిటెన్ లెక్కల బట్టి చూస్తే ఇండియాలో గడిచిన 24 గంటల్లో గంటల్లో 9,121 మందికి కరోనా నిర్ధారణ అయింది.అదే స‌మ‌యంలో 11,805 మంది కోలుకున్నారు.

దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,09,25,710 కు చేరింది.ఇకా గడిచిన 24 గంట‌ల సమయంలో 81 మంది కరోనా కారణంగా మృతి చెందారు.

ఈ పరిణామంతో మృతుల సంఖ్య 1,55,813కు పెరిగింది.దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,06,33,025  మంది కోలుకున్నారు.1,36,872  మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌ లలో చికిత్స అందుతోంది.ఇప్ప‌టివ‌ర‌కు 87,20,822 మందికి వ్యాక్సిన్ వేశారు.

Telugu Central Health Ministry, Corona Health Bullettin, Corona Positive Cases, Corona Vaccine, Corona Virus, Deaths, Recovered-Latest News - Telugu.

#Corona Vaccine #Deaths #CoronaPositive #CentralHealth #CoronaHealth

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు