భారత్‌కు కృతజ్ఞతలు చెప్పిన శ్రీలంక అధ్యక్షుడు!

కరోనా వైరస్ ను నియంత్రించడానికి అన్ని దేశాలు కలిసి ముందడుగు వేస్తున్నాయి.ప్రపంచ దేశాలకు వారి ప్రజలను కాపాడటానికి భారత్‌ ఔషధాలు పంపి సాయం చేస్తోంది.

 Sri Lanka President Thanks To India For Sending Medicines, India, Corona Virus,-TeluguStop.com

ఇప్పటికే అమెరికాకు కరోనా నియంత్రణ కోసం మందులు పంపి సాయం చేసిన భారత ప్రభుత్వం ఇప్పుడు శ్రీలంకకు కూడా ఔషదాలు పంపి సాయం చేసింది.

శ్రీలంకలోనూ కరోనా విజృంభించడంతో తమను ఆదుకోవాలని ఇటీవల భారత్‌కు శ్రీలంక ప్రభుత్వం చేసిన విజ్ఞప్తి నేపథ్యంలో భారత ప్రభుత్వం ఆ దేశానికి కరోనా నిర్ధారణ, చికిత్సకు అత్యవసరమైన వైద్య పరికరాలతో పాటు వైద్యుల రక్షణ సామగ్రి, మాస్కులను పెద్ద ఎత్తున పంపింది.

సుమారు పది టన్నుల పరికరాలను శ్రీలంకకు ప్రత్యేక విమానంలో భారత్ పంపించింది.

దీంతో ఈ విషయంపై శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్స ట్వీట్ చేస్తూ ప్రధాని మోదీకి, భారతదేశ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

ఆ ట్వీట్ లో ”భారత ప్రధాని నరేంద్ర మోదీ, ప్రభుత్వం, ప్రజలకు నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను.శ్రీలంకకు ప్రత్యేక విమానం ద్వారా అవసరమైన ఔషధాలు పంపి భారత్ సాయం చేసింది.

కరోనాతో సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొంటున్న సమయంలో గొప్ప సాయాన్ని అందించారు” అని శ్రీలంక అధ్యక్షుడు పేర్కొన్నారు.అంతేకాదు ప్రాణాలు కాపాడే 10 టన్నుల ఔషధాల ఫొటోలను పోస్ట్ చేశారు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube