హైడ్రాక్సీక్లోరోక్విన్‌ : ప్రపంచం మొత్తం ఇప్పుడు దీని కోసం ఇండియా వెంట పడుతున్నాయి కారణం ఏంటీ?

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ విలయ తాంఢవం చేస్తున్న సమయంలో అన్ని దేశాలకు కూడా ఇప్పుడు ఒకే ఒక్క ఆశాకిరణం కనిపిస్తోంది.అదే హైడ్రాక్సీ క్లోరోక్విన్‌.

 Us Request To India Pm Narendra Modi Supply Of Hydroxychloroquine For Corona Vir-TeluguStop.com

ఈ మెడిసిన్‌ను ప్రపంచ వ్యాప్తంగా కూడా మలేరియా ఇంకా కీళవాతంకు ఇండియాలో వాడుతున్నారు.సాదారణంగా అయితే ఈ మందు అధికంగా వాడితే సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉన్నాయంటూ వైధ్యులు అంటున్నారు.

అయితే అవసరంకు తగ్గట్లుగా వైధ్యులు తమ పేషెంట్స్‌కు ఈ మందును ఇస్తున్నారు.ఇండియాలో హైడ్రాక్సీ క్లోరోక్వీన్‌ ఉత్పత్తి అత్యధికంగా ఉంది.

Telugu America, Corona, Donald Trump, Indiaamerica, India Lock-General-Telugu

ప్రస్తుతం ఇండియాకు కావాల్సిన దానికంటే కూడా పలు రెట్లు ఈ ఔషదం ఉన్నట్లుగా చెబుతున్నారు.భవిష్యత్తు అవసరాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం ఈ ఔషదం ఎగుమతిని నిలిపేయడం జరిగింది.తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ స్వయంగా మన ప్రధాని మోడీకి ఫోన్‌ చేసి ఈ ఔషదం ఎగుమతి గురించి విజ్ఞప్తి చేయడం జరిగింది.చర్చించి నిర్ణయం తీసుకుంటామంటూ మోడీ సమాధానం ఇచ్చారట.

మోడీ ఇండైరెక్ట్‌గా ట్రంప్‌కు నో చెప్పడంతో ఆయన తీవ్రంగా హర్ట్‌ అయ్యి ఈ పరిణామాలు రాబోయే కాలంలో తీవ్ర ప్రతీకార చర్యలకు తెర తీసే అవకాశం ఉంటుందని డైరెక్ట్‌గా ఇండియాను ట్రంప్‌ హెచ్చరించాడు.

Telugu America, Corona, Donald Trump, Indiaamerica, India Lock-General-Telugu

ట్రంప్‌ అన్నంత పని చేస్తాడు.అమెరికా నుండి ఇండియాకు పలు ఆర్థిక పరమైన వ్యాపార సంబంధాలు ఉన్నాయి.ఈ నేపథ్యంలో ట్రంప్‌ తో విభేదించకుండా ఆ మెడిసిన్‌ ఇచ్చినట్లయితే ఇండియాలో అత్యవసర పరిస్థితులు ఏర్పడితే పరిస్థితి ఏంటీ అనేది కేంద్ర ప్రభుత్వం ఆందోళనలో ఉంది.

ట్రంప్‌ హెచ్చరికలకు భయపడాల్సిన పని లేదు అంటూ ఎంతో మంది అంటున్నారు.అయితే ప్రస్తుతం మన వద్ద అధికంగా ఉన్న ఔషదాలను ఎగుమతి చేయడం లో తప్పేముందని కొందరు అంటున్నారు.

మొత్తానికి ప్రపంచ వ్యాప్తంగా కూడా హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ గురించి ఇండియా వైపు చూస్తున్నారు.ఈ సమయంలో ఇండియా ఎలా వ్యవహరిస్తుంది అనే విషయమై ప్రపంచ వ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి.

కరోనాకు వ్యాన్సిన్‌ కనిపెట్టే వరకు హైడ్రాక్సీ క్లోరోక్వీన్‌తోనే దాన్ని తగ్గించేందుకు దేశాలు అన్నీ కూడా ప్రయత్నాలు చేస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube