ప్రజాస్వామ్య బద్ధంగా ఏర్పడిన పౌర ప్రభుత్వాన్ని కుప్పకూల్చి తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ పాలనను హస్తగతం చేసుకున్న సంగతి తెలిసిందే.స్వయంగా ఆ దేశాధ్యక్షుడు అష్రఫ్ ఘనీ సహా కీలక నేతలు, అధికారులు ఆఫ్గన్‌ను వదిలిపెట్టి పారిపోయారు.
అటు తాజా పరిస్ధితుల నేపథ్యంలో అన్ని దేశాలు ఆఫ్గన్‌లో వున్న దౌత్య సిబ్బందిని స్వదేశానికి తరలించేందుకు ప్రత్యేక విమానాలను పంపుతున్నాయి.ఇటు ఆఫ్గన్ ప్రజలు సైతం దేశం విడిచి వెళ్లకుంటే తాలిబన్ల చేతిలో చిత్ర హింసలకు గురికావాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
దీంతో కాబూల్ విమానాశ్రయానికి పోటెత్తిన జనం.దొరికిన విమానమెక్కి పారిపోతున్నారు.
అటు భారత ప్రభుత్వం కూడా ఆఫ్ఘన్‌లో పనిచేస్తున్న దౌత్య సిబ్బందితో పాటు సాధారణ ప్రజలను కూడా స్వదేశానికి తరలించింది.కాబూల్‌లో భారత రాయబారి రుద్రేంద్ర టాండన్, 120 మంది దౌత్య సిబ్బందితో భారత వాయుసేనకు చెందిన సి17 రవాణా విమానం మంగళవారం ఉదయం 11.15 గంటల సమయంలో గుజరాత్‌లోని జామ్‌నగర్ ఎయిర్ బేస్‌కు చేరుకుంది.అక్కడినుంచి విమానం ఢిల్లీ సమీపంలోని హిండన్ ఎయిర్‌బేస్‌కు బయలుదేరి వెళ్లింది.
సోమవారం కాబూల్ విమానాశ్రయంలో విమాన సర్వీసులు నిలిచిపోవడానికి ముందే మరో సి17 విమానంలో దాదాపు 40 మంది సిబ్బందిని భారత్ తరలించింది.
ఈ నేపథ్యంలో ఆఫ్ఘన్‌లో చిక్కుకున్న భారతీయులు, భారత సంతతి ప్రజల రక్షణపై కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ ఆందోళన వ్యక్తం చేశారు.
ముఖ్యంగా పెద్ద సంఖ్యలో వున్న సిక్కులు, ఇతర మతస్తులను భారత్‌కు తరలించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు ఆయన తెలిపారు.మన విదేశాంగ మంత్రి జైశంకర్ ఈ పనుల్లోనే తలమునకలై వున్నారని హర్దీప్ చెప్పారు.

ప్రస్తుత పరిస్ధితుల నేపథ్యంలో ఢిల్లీ సిక్కు గురుద్వారా ఎంజీఎంటీ అధ్యక్షుడు, శిరోమణి అకాలీదళ్ నేత మంజిందర్ సింగ్ సిర్సా.కాబూల్‌లోని కార్టే పర్వన్ గురుద్వారాలో ఆశ్రయం పొందారని కేంద్ర మంత్రి వెల్లడించారు.తాను కాబూల్, సంగత్, గురుద్వారా కమిటీలతో టచ్‌లో వున్నట్లు హర్దీప్ సింగ్ పూరి చెప్పారు.తాలిబన్ నేతలు కూడా వారిని కలిసి.భద్రతపై హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోందన్నారు.