సవాలక్ష కొర్రీలు.. వ్యాపారానికి భారత్ క్లిష్టమైన ప్రదేశం: యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ నివేదిక

భారత్‌లో వ్యాపారం చేయడం కత్తిమీద సాములా వుందని అమెరికా విదేశాంగ శాఖ వ్యాఖ్యానించింది.భారత ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక, వ్యవసాయ చట్టాలతో పాటు కొన్ని సంస్కరణ చర్యలు ఇందుకు ప్రతిబంధకంగా వున్నాయని అభిప్రాయపడింది.

 India 'challenging Place' To Do Business, Must Ease Hurdles Us State Dept, Us St-TeluguStop.com

పెరిగిన సుంకాలు, సైన్స్ ఆధారంగా జరగని శానిటరీ, ఫైటోశానిటరీ చర్యలు, అంతర్జాతీయ ప్రమాణాల స్థాయిని అందుకోని భారతీయ ప్రమాణాలు తదితర అంశాలు భారత్ విషయంలో చూస్తున్నామని తెలిపింది.

వాషింగ్టన్ అనేక సమస్యలను పాటిస్తోందని ఆరోపించిన స్టేట్ డిపార్ట్‌మెంట్.

భారత్‌తో వున్న పలు సమస్యలపై అమెరికా ప్రభుత్వం ఇప్పటికే అభ్యంతరాలు వ్యక్తం చేసిన సంగతిని గుర్తుచేసింది.తమ విధానాల వల్ల.

భారత్ అంతర్జాతీయ కట్టుబాట్లను ఉల్లంఘించినట్లు కాదని భారతీయ అధికారులు ఎన్నో సార్లు వివరణ ఇచ్చారు. ఎఫ్‌డీఐని సరళీకృతం చేస్తూ భారత ప్రభుత్వాలు వచ్చినప్పటికీ.

సంప్రదింపుల ప్రక్రియ నుంచి వాటాదారులను పక్కన పెట్టడంపై అమెరికా పలుమార్లు ఫిర్యాదు చేసింది.

ఉదాహరణకు విమానయానానికి సంబంధించిన ఎఫ్‌డీఐ నిబంధనలను అమెరికా విదేశాంగ శాఖ మరోసారి పునరుద్ఘాటించింది.

ఇందులో 100 శాతం విదేశీ నిధులను అనుమతించారని.అయితే భారతీయ పౌరుల మెజారిటీ నియంత్రణను తప్పనిసరి చేయడం అందుకు సంబంధించి నిబంధనలపై ఇంకా క్లారిటీ ఇవ్వకపోవడంపై యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్రశ్నలు లేవనెత్తింది.

అలాగే బీమా రంగానికి సంబంధించిన ఎఫ్‌డీఐపైనా అమెరికా పెదవి విరిచింది.

Telugu India, India Place, Hurdles Dept, Phytosanitary, Sanitary-Telugu NRI

బీమా రంగంలో ప్రస్తుతం 49 శాతంగా వున్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని 74 శాతానికి పెంచింది కేంద్రం.ఈ మేరకు బీమా చట్టం 1938కి సవరణ చేస్తామని వెల్లడించింది.అయితే మెజారిటీ డైరెక్టర్లు, మేనేజ్‌మెంట్‌కు చెందిన వ్యక్తులు భారతీయులే అయ్యి వుండాన్న నిబంధనపై అమెరికా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.

అలాగే 50 శాతం మంది డైరెక్టర్లు స్వతంత్రులై వుండాలన్న షరతుపైనా అగ్రరాజ్యం గుర్తుగా వుంది.దీనితో పాటు ఇండియాలో జరిపే చెల్లింపుల లావాదేవీలకు సంబంధించి డేటాను స్టోర్ చేయాలన్న ఆర్‌బీఐ ఆదేశం వల్ల ఖర్చులు పెరగడంతో పాటు సైబర్ దాడులు జరిగే అవకాశంపైనా అమెరికా విదేశాంగ శాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube