25 ఏళ్ల అనుబంధానికి గుడ్‌బై: నోకియా సీఈవోగా వైదొలగనున్న రాజీవ్ సూరి

మొబైల్ దిగ్గజం నోకియాతో 25 ఏళ్ల అనుబంధాన్ని భారత సంతతికి చెందిన రాజీవ్ సూరి తెంచుకున్నారు.ఆ కంపెనీ అధ్యక్షుడు, సీఈవో బాధ్యతల నుంచి ఆయన వైదొలగనున్నారు.

 India Born Nokia President Ceo Rajeev Suri Has Decided To Quit The Company-TeluguStop.com

వ్యక్తిగత కారణాల కారణంగా సూరి తన బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.కొత్త అధ్యక్షుడు, సీఈవోగా పెక్కా లుండ్‌మార్క్‌ను నోకియా డైరెక్టర్ల బోర్డు నియమించింది.

ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు.

గత కొన్నేళ్లుగా తనతో కలిసి పనిచేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు, నోకియాకు మంచి భవిష్యత్ ఉందని రాజీవ్ ఓ ప్రకటనలో తెలిపారు.

తాను సీఈవో బాధ్యతల నుంచి వైదొలగుతానని సూరి నోకియా బోర్డుకు ఎప్పటి నుంచో సంకేతాలు ఇస్తూ వచ్చారు.సూరి తన పదవిలో ఆగస్టు 31, 2020కు కొనసాగుతారు.2021 జనవరి 1 వరకు నోకియా బోర్డు సలహదారుగా కొనసాగుతారు.

Telugu Ceo Rajeev Suri, Ceorajeev, Nokia, Nokia Directors, Nokia Ceo, Pekka Lund

రాజీవ్ సూరి భారత మూలాలున్న వ్యక్తి.అతని కుటుంబం సింగపూర్‌లో స్థిరపడింది.1995లో ఆయన నోకియాలో చేరారు.మధ్యప్రాచ్యం, ఆసియా, ఆఫ్రికా, ఐరోపా దేశాల్లో నోకియా కార్యకలాపాలకు సంబంధించిన విలీనాలు.కొనుగోళ్లు, ప్రోడక్ట్ మార్కెటింగ్, సేల్స్ తదితర విభాగాల్లో పనిచేశారు.ఆసియా పసిఫిక్ ప్రాంతంలో నోకియా సొల్యూషన్స్ అండ్ నెట్‌వర్క్స్ కార్యకలాపాలకు సారథ్యం వహించారు.2014లో నోకియాకు అధ్యక్షుడిగా నియమితులై, సంస్థను పునర్వ్యస్థీకరించి, మళ్లీ లాభాల బాటలోకి తెచ్చారు.1967లో భారత్‌లో పుట్టిన రాజీవ్ సూరి, మణిపాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి పట్టా పొందారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube