భారత్ గగనతలంలోకి చొరబడ్డ పాక్ విమానాలు!  

భారత గగనతలంలోకి ప్రవేశించిన పాకిస్తాన్ యుద్ధ విమానాలు. తిప్పి కొట్టిన భారత్ ఎయిర్ ఫోర్స్. .

India And Pakistan War In Border-

పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్ లో ఉగ్ర స్థావరాలపై భారత సైనికేతర చైర్యకి దిగిన సంగతి తెలిసిందే.దీంతో భారత్ దాడిని సహించలేకపోతున్న పాకిస్తాన్ రక్షణ శాఖ భారత్ పై కవ్వింపు చర్యలకి పాల్పడుతుంది.

India And Pakistan War In Border--India And Pakistan War In Border-

సరిహద్దు వెంబడి పాకిస్తాన్ యుద్ధ వాతావారణం సృష్టిస్తూ భారత్ ని రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తూ వుంటే భారత్ రక్షణ దళంలో త్రివిధ దళాలు పాకిస్తాన్ కవ్వింపు చర్యలని తిప్పి కొడుతున్నాయి.భారత్ లో జనావాసాలని టార్గెట్ గా చేసుకొని పాకిస్తాన్ బలగాలు కాల్పులు చేస్తున్నారు.

ఇదిలా వుంటే తాజాగా పాకిస్తాన్ యుద్ధ విమానాలు భారత గగనతలంలోకి అక్రమంగా ప్రవేశించి బాంబు దాడులు చేసే ప్రయత్నం చేసింది.అయితే పాకిస్తాన్ యుద్ధ విమానాలని భారత్ ఎయిర్ ఫోర్స్ తిప్పి కొట్టి పాకిస్తాన్ కి చెందిన ఎఫ్ 16 యుద్ధ విమానాన్ని కూల్చివేసినట్లు తెలుస్తుంది.ఇక భారత్ యుద్ధ విమానాలని కూడా కూల్చివేసినట్లు పాకిస్తాన్ ప్రకటించినట్లు తెలుస్తుంది.ఇదిలా వుంటే పాకిస్తాన్ కవ్వింపు చర్యల నేపధ్యంలో భారత్ పౌర విమాన సర్వీస్ లని పూర్తిగా రద్దు చేసినట్లు తెలుస్తుంది.

ఓ విధంగా చెప్పాలంటే ఈ యుద్ధ వాతావరణం సరిహద్దులో మరింత విస్తరిస్తున్నట్లు తెలుస్తుంది.అయితే అధికారికంగా యుద్ధం జరుగుతున్నట్లు ప్రకటించకపోయిన అనాదికారిమగా రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతుందని చెప్పాలి.