మరోసారి దాయాదుల పోరు.. ఓకే గ్రూప్ లో ఇండియా, పాక్..!

మనదేశంలో క్రికెట్ అంటే చాలా మందికి ఇష్టం.కొందరికైతే ప్రాణం.

 India And Pakistan Are In The Same Group In T 20 World Cup 2021 , One Group, Ind-TeluguStop.com

సినిమా హీరోల కంటే ఎక్కువగా క్రికెట్ ఆడేవారికే చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు.క్రికెటర్లు చూపించే అతి అసాధారణమైన ప్రతిభ చాలా మందిని ఉర్రూతలూగిస్తుంటుంది.

క్రికెట్ లో ముఖ్యంగా కొన్ని ప్రత్యేకమైన జట్ల మధ్య మ్యాచ్ జరిగితే ఆ కిక్కే వేరు.అందులోనూ ఇండియా, పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగితే ప్రపంచం మొత్తం ఎంతో ఉత్కంఠ భరితంగా చూస్తుంది.

ఇండియా, పాకిస్థాన్ జట్లు క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నాయంటే చాలు ఆ టెన్షనే వేరుగా ఉంటుంది.ఆ రెండు దేశాల అభిమానులు వెయ్యి కళ్లతో మ్యాచ్ ను చూస్తారు.

ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ లు గ్రౌండ్ లో మొదలయ్యాయంటే చాలు అభిమానులు టీవీలకు అతుక్కుపోతారు.ఈ రెండు జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే ఓ ప్రపంచ యుద్దాన్ని తలపిస్తుంది.

అటువంటి క్రికెట్ మ్యాచ్ కోసం చాలా సంవత్సరాలుగా అభిమానులు, ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.అలా చూడాలనుకునేవారికి ఓ శుభవార్త.

త్వరలోనే టీ20 వ‌ర‌ల్డ్‌ క‌ప్‌ లో ఈ రెండు టీమ్ లు తలపడనున్నాయి.ఈ రెండు జట్లు కూడా ఒకే గ్రూప్‌లో ఉండటం విశేషం.

టీ20 ప్రపంచ కప్ నేపథ్యంలో ఐసీసీ 2 గ్రూపుల‌ను వెల్లడించింది.అక్టోబ‌ర్ 17వ తేది నుంచి న‌వంబ‌ర్ 14వ తేది మ‌ధ్య యూఏఈలో టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ జరగబోతోంది.

Telugu Cup, Cricket, Ind Pak Cricket, India, Latest, Pakistan, Ups-Sports News

సూప‌ర్ 12లో ఇండియా గ్రూప్ 2లో ఉంది.అలాగే వ‌ర‌ల్డ్‌క‌ప్‌ లో రెండు రౌండ్లుగా మ్యాచ్‌ లు నిర్వహించనున్నారు.మొదటి రౌండ్‌లో గ్రూప్ A, గ్రూప్ B లోని 8 క్రికెట్ టీమ్ లు తలపడతాయి.అందులో నుంచి నాలుగు జట్లు ప్ర‌ధాన రౌండ్‌ కు అర్హత పొందుతాయి.

ఈ సీరిస్ మొత్తం ఇండియాలోనే జరగాల్సి ఉంది.అయితే కరోనా కారణంగా వాటి స్థలం మార్పు చెందింది.

ఆ మ్యాచ్ లను యూఈఏలో జరిగేలా ఐసీసీ ప్రణాళిక వేసింది.టోర్నమెంట్ హోస్ట్‌ గా మాత్రం ఇండియానే ఉండటం విశేషంగా చెప్పొచ్చు.

Telugu Cup, Cricket, Ind Pak Cricket, India, Latest, Pakistan, Ups-Sports News

గ్రూప్ 1లో వెస్టిండీస్‌, ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, గ్రూప్ A విజేత‌, గ్రూప్ B ర‌న్న‌ర‌ప్‌ ఉంటాయి.గ్రూప్ 2లో ఇండియా, పాకిస్థాన్‌, న్యూజిలాండ్‌, ఆఫ్ఘ‌నిస్థాన్‌, గ్రూప్ A ర‌న్న‌ర‌ప్‌, గ్రూప్ B విజేత‌ ఉంటాయి.ఇకపోతే గ్రూప్ A లో శ్రీలంక‌, ఐర్లాండ్‌, నెద‌ర్లాండ్స్‌, నమీబియా జట్లు ఉంటాయి.అలాటే గ్రూప్ B లో బంగ్లాదేశ్‌, స్కాట్లాండ్‌, ప‌పువా న్యూగినియా, ఒమ‌న్ జట్లు ఉంటాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube