‘టూరిజం’లో పరస్పర సహకారం .. భారత్- ఆస్ట్రేలియాల మధ్య అవగాహనా ఒప్పందం

భారత్- ఆస్ట్రేలియా మధ్య పర్యాటక, ఆర్ధిక సంబంధాలను మరింత బలోపేతం చేసే ప్రయత్నంలో భాగంగా శనివారం పర్యాటక సహకారంపై ఆస్ట్రేలియా- భారత్ అవగాహన ఒప్పందాన్ని (ఎంవోయూ)ను పునరుద్ధరించారు.ఈ ఒప్పందం ద్వారా భారతీయ సందర్శకుల సంఖ్యను పెంచడం, భారతదేశాన్ని అత్యంత విలువైన మార్కెట్‌గా పరిగణిస్తూ.

 India And Australia Sign Mou To Strengthen Tourism Ties, Minister Dan Tehan, Aus-TeluguStop.com

స్థానిక ఉద్యోగులు, వ్యాపారాలకు మద్ధతు ఇవ్వాలని ఆస్ట్రేలియా లక్ష్యంగా పెట్టుకుంది.ఇందుకు సంబంధించిన అవగాహనా ఒప్పందంపై ఆస్ట్రేలియా వాణిజ్య, పర్యాటక, పెట్టుబడుల మంత్రి డాన్ టెహన్.భారత వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ సంతకాలు చేశారు.

2019లో భారత్‌ నుంచి దాదాపు 4,00,000 మంది ఆస్ట్రేలియాను సందర్శించారని టెహాన్ చెప్పారు.తద్వారా ఆస్ట్రేలియా ఆర్ధిక వ్యవస్ధకు 1.8 బిలియన్ డాలర్లను అందించారని ఆయన తెలిపారు.దీనికి అదనంగా 7,50,000 మంది భారత సంతతి ప్రజలు ఆస్ట్రేలియాను సొంత ఇంటిలా భావిస్తున్నారని టెహాన్ తెలిపారు.ఈ ఏడాది టీ 20 ప్రపంచకప్‌ను ఆస్ట్రేలియా నిర్వహిస్తుండటంతో భారత్ నుంచి పెద్ద సంఖ్యలో పర్యాటకులు, వ్యాపారవేత్తలు తమ దేశానికి వచ్చే అవకాశం వుందని ఆయన చెప్పారు.

కాగా.ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసిన్ సోమవారం కీలక ప్రకటన చేశారు.ఫిబ్రవరి 21 నుంచి అంతర్జాతీయ ప్రయాణీకులను ఆస్ట్రేలియాలోకి అనుమతిస్తామని ఆయన స్పష్టం చేశారు.అయితే వారంతా రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకుని వుండాలని మోరిసిన్ అన్నారు.అయితే రాష్ట్రాలు తమ సొంత క్వారంటైన్ నిబంధనలను మాత్రం అమలు చేస్తాయని ఆయన తెలిపారు.అంతర్జాతీయ టూరిస్టుల ద్వారా తన పర్యాటక రంగాన్ని తిరిగి గాడిలో పెట్టాలని ఆస్ట్రేలియా భావిస్తోంది.

కోవిడ్ ఆంక్షలు, వరుస లాక్‌డౌన్‌ల కారణంగా హాస్పిటాలిటీ రంగం తీవ్రంగా దెబ్బతింది.

టూరిజం ఆస్ట్రేలియా గణాంకాల ప్రకారం.అక్కడి పర్యాటక రంగం కోవిడ్‌కు ముందు 84.9 బిలియన్ డాలర్లకు పైగా ఆర్జించింది.కరోనా వెలుగుచూసిన తొలి సంవత్సరంలో టూరిజం సెక్టార్ 41 శాతం మేర ఆదాయాన్ని కోల్పోయింది.ప్రస్తుతం దేశంలో కోవిడ్ కారణంగా ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య తగ్గుముఖం పట్టడంతో క్రమంగా ఆంక్షలను సడిలిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే అంతర్జాతీయ టూరిస్టులకు ఆస్ట్రేలియా డోర్స్ ఓపెన్ చేసింది.

India And Australia Sign MoU To Strengthen Tourism Ties, Minister Dan Tehan, Australia, Australian Prime Minister Scott Morrison, International Tourists, India-Australia, Tourism, Finance - Telugu Australia, Australianprime, Indiaaustralia, India Australia, International, Dan Tehan, Tourism

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube