ట్రంప్ మార్క్ - న్యూయార్క్ న్యాయమూర్తిగా..."తెలుగు మహిళ ”  

India-american Saritha Komatireddy Appointed As Judge In Us - Telugu Donald Trump, , Judge, Nri, Saritha Komatireddy, Telugu Nri News, Us

ఎల్లలు దాటి విదేశాలలో స్థిరపడిన భారతీయులు లెక్కలేనంతమంది.అదే విధంగా అమెరికాలో స్థిరపడిన భారతీయులు ఎందరో ఉన్నారు.

India-american Saritha Komatireddy Appointed As Judge In Us - Telugu Donald Trump Nri News Us

అయితే, స్థిరపడటం అంటే, ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటూ ఉండటం మాత్రమే కాదు, విదేశంలో కూడా తమదైన రీతిలో అన్ని విభాగాలలో పనిచేస్తూ, సేవా కార్యక్రమాలు చేపడుతూ అత్యంత కీలకమైన పదవులలో సైతం రాణిస్తున్నారు.విద్య, వైద్య రంగం, రాకీయ రంగంతో పాటుగా, న్యాయ స్థానాల్లో తీర్పునిచ్చే స్థాయిలో వారు నిలబడుతున్నారు.

తాజాగా ఇలాంటి ఘనమైన కీర్తిని సాధించింది ఇండో అమెరికన్ అమ్మాయి.
కోమటిరెడ్డి .సరిత అనే ఇండో అమెరికన్ మహిళకు అమెరికాలో ఓ కీలక పదవి దక్కింది.అమెరికా డిస్ట్రిక్ట్ కోర్ట్ ఫర్ ఈస్ట్రన్ డిస్ట్రిక్ట్ ఆఫ్ న్యూయార్క్ న్యాయమూర్తిగా సరితని నామినేట్ చేస్తున్నట్లు తాజాగా అమెరికా అధ్యక్షుడు డోనాల్ ట్రంప్ ప్రకటన చేశారు.

సరితని నియమించడం అంత సాదా సీదాగా జరగలేదు.ఎంతో మంది సీనియర్ న్యాయమూర్తులు వారి వారి అనుభవాలని బేరీజు వేసుకున్న తరువాత సరితని మించిన అనుభవం, ప్రతిభ మరొకరికి లేదని గురిటించిన తరువాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

ఇదిలాఉంటే సరిత అమెరికా న్యాయవ్యవస్థలో అనేక విభాగాల్లో పనిచేసి ఆమె ప్రతిభను కనబరిచారు.బీపీ డీప్ వాటర్ హరిజన్, ఆయిల్ స్పిల్ అండ్ ఆఫ్ షోర్ డ్రిల్లింగ్ జాతీయ కమిషన్ తరపున న్యాయవాదిగా పలు కేసుల్లో ఆమె తన వాదనని సమర్ధవంతంగా వినిపించారు.ప్రస్తుతం సరిత, యూఎస్ అటార్నీ ఆఫీస్ ఫర్ ఈస్ట్రన్ డిస్ట్రిక్ట్ ఆఫ్ న్యూయార్క్ (జనరల్ క్రైమ్స్) డిప్యూటీ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నారు.గతంలో ఈమె అదే కార్యాలయంలో నార్కోటిక్స్, మనీ లాండరింగ్, హ్యాకింగ్ అండ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ కోఆర్డినేటర్ గా పనిచేశారు.

సరిత నియామకం పట్ల ఎంతో మంది ప్రవాసాంధ్రులు సంతోషం వ్యక్తం చేశారు.అత్యున్నత పదివికి ఆమెని ఎంపిక చేసినందుకు ప్రవాస భారతీయులు అందరూ ట్రంప్ కి కృతజ్ఞతలు తెలిపారు.

తాజా వార్తలు

India-american Saritha Komatireddy Appointed As Judge In Us-,judge,nri,saritha Komatireddy,telugu Nri News,us Related Telugu News,Photos/Pics,Images..