ఓసీఐ కార్దుదారులకు కేంద్రం గుడ్‌న్యూస్: ఇండో అమెరికన్లు హర్షం  

India Allows Entry Of OCI Card Holders From US, UK, Germany, France, OCI Card Holders,India, Corona Effect - Telugu Corona Effect, France, Germany, India, India Allows Entry Of Oci Card Holders From Us, Oci Card Holders, Uk

ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా (ఓసీఐ) కార్డుదారులకు భారత ప్రభుత్వం శుభవార్త చెప్పింది.అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ దేశాల్లో ఉన్న ఓసీఐ కార్దుదారులు భారత్‌కు రావొచ్చని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది.

 India Allows Entry Of Oci Card Holders

అంతేకాకుండా వారి ప్రయోజనాలను సైతం పునరుద్ధరిస్తున్నట్లు పేర్కొంది.

అంతర్జాతీయ ప్రయాణాలపై వివిధ దేశాలు ఆంక్షలు సడలిస్తున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం.

ఓసీఐ కార్దుదారులకు కేంద్రం గుడ్‌న్యూస్: ఇండో అమెరికన్లు హర్షం-Telugu NRI-Telugu Tollywood Photo Image

అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్ దేశాలతో ద్వైపాక్షిక ‘‘ ఎయిర్ బబుల్’’ ఒప్పందాన్ని కుదుర్చుకుంది.దీనిలో భాగంగానే ఈ దేశాల్లో స్ధిరపడిన ఓసీఐ కార్డుదారుల రాకకు తలుపులు తెరిచింది.

ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వ నిర్ణయాన్ని ఇండో అమెరికన్లు స్వాగతించారు.తాజా ఒప్పందం ప్రకారం.

వైద్యం, వ్యాపారం, ఉపాధి నిమిత్తం ఈ దేశాల నుంచి వచ్చే విదేశీయులకు వీసా సదుపాయం కల్పిస్తామని వెల్లడించింది.భారతీయులు సైతం ఏ రకమైన వీసాల ద్వారానైనా ఈ దేశాలకు వెళ్లవచ్చని హోంశాఖ తన ఉత్తర్వుల్లో పేర్కొంది.

కాగా వందే భారత్ మిషన్ ప్రారంభించిన తొలి రోజుల్లో విదేశీయుల వీసాతో పాటు అవసరం లేకుండా భారతదేశానికి వచ్చే వెసులుబాటు ఉన్న ఓసీఐ కార్డులపై కేంద్రం తాత్కాలిక నిషేధించడం పెద్ద దుమారాన్ని రేపింది.దీని వల్ల అమెరికాలో హెచ్ 1 బీ, గ్రీన్‌కార్డుదారుల పిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.దీంతో పలువురు ప్రవాస ప్రముఖుల విజ్ఞప్తి మేరకు భారత ప్రభుత్వం మే నెలలో ఈ తాత్కాలిక నిషేధాన్ని ఎత్తివేసిన సంగతి తెలిసిందే.ఇక తాజాగా అంతర్జాతీయ ప్రయాణాలు ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తుండటంతో ఆంక్షలు ఎత్తివేస్తున్న దేశాలతో భారత ప్రభుత్వం చర్చలు జరుపుతోంది.

#Corona Effect #France #India #Germany #IndiaAllows

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

India Allows Entry Of Oci Card Holders Related Telugu News,Photos/Pics,Images..