భారత్ చైనా సరిహద్దుల్లో టెన్షన్.. ఊహించని ముప్పు..

భారత్, చైనా సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం ఏర్పడింది.సరిహద్దుల్లో ప్రాజెక్టులు, రోడ్ల నిర్మాణాలు చేపడుతూ కవ్వింపులకు చైనా పాల్పడుతుంది.

 India 135 Km Highway Along Lac In Ladakh To Counter China Details, India, 135 Km-TeluguStop.com

అయితే ఇదే సమయంలో అంతర్జాతీయ వార్తా సంస్థ రైటర్స్ కథనం మరింతర ఆందోళన కలిగిస్తుంది.సరిహద్దు ప్రాంతంలో చైనా కొత్త సైనిక స్థావరాలను ఏర్పాటు చేస్తున్నాడంతో భారత్, చైనా సైనికుల మధ్య మరిన్ని సంఘర్షణలు జరిగే అవకాశం ఉందని వెల్లడించింది.

ఇటీవల జరిగిన డీజీపీల సమావేశంలో చైనా వ్యవహారం పై అధికారులు సమర్పించిన నివేదికలో చాలా అంశాలను రైటర్స్ ఒక కథనాన్ని పబ్లిష్ చేసింది.అయితే చైనా, భారత్ సరిహద్దుల్లో పరిస్థితులను అప్రమత్తంగా ఆర్మీ అధికారులు పర్యవేక్షిస్తున్నారు.

అయితే సరిహద్దు పరిస్థితులపై లెఫ్టినెంట్ జనరల్ ఆర్‌పీ కలిటా భిన్న వ్యాఖ్యలు చేశారు.ఇప్పటికైతే చైనాతో ఉత్తర సరిహద్దు ప్రాంతంలో పరిస్థితి అదుపులోనే ఉందని, కానీ ముందు ముందు ఏం జరుగుతుందో చెప్పలేమని వెల్లడించారు.

Telugu Km Highway, China, China Projects, India, Indiachina, International, Lada

సరిహద్దు భద్రతను కాపాడడంలో తూర్పు వైపున ఉన్న సైన్యం పాత్ర చాలా కీలకమని అభిప్రాయపడ్డారు.ఇక ఆర్మీ కూడా ఎంతో అలర్ట్ గా ఉండాలని ఆయన హెచ్చరించారు.అయితే చైనా అక్రమ ప్రాజెక్టులు ఇతర నిర్మాణాలకు చెక్ పెట్టేలా కేంద్రం కౌంటర్ ప్లాన్ మొదలుపెట్టింది.ఎల్ఏసి వెంబడి 135 కిలోమీటర్ల పొడవునా హైవే నిర్మాణానికి రక్షణశాఖ తన అడుగులను వేగవంతం చేసింది.

Telugu Km Highway, China, China Projects, India, Indiachina, International, Lada

హైవే నిర్మాణం కోసం బిడ్లను వేసింది.ఈ హైవేను రెండు సంవత్సరాలు పూర్తి చేయనున్నట్లు సమాచారం.మధ్యలో డూంగ్రీ, ఫక్చే ప్రాంతాలను ఇది కనెక్ట్ చేసే అవకాశం ఉంది.ఇక రోడ్డు నిర్మాణానికి అప్పటి జమ్ము కాశ్మీర్ ప్రభుత్వం 2016 మార్చిలో ఆమోదం తెలిపింది.

ఈ ప్రాజెక్ట్ యూనియన్ టెరిటరీలోని చాంగ్ తంగ్ కోల్డ్ ఎడారి వన్య ప్రాణాల అభయారణ్యం గుండా వెళుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube